IPL 2022 FINAL : ప్రపంచంలోనే టాప్ మోస్ట్ పాపులర్ లీగ్ గా పేరొందింది బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL 2022 FINAL ). ప్రస్తుతం 15వ సీజన్ జరుగుతోంది. ఈనెల 29న ఫైనల్ జరగనుంది.
ఇప్పటికే సగం మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ జరిగే మ్యాచ్ 50వది కావడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆప్స్ కు దగ్గరలో ఉన్నాయి.
మిగతా జట్లు ఏవి వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ప్లే ఆఫ్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతున్నాయి.
ఆఖరు వరకు చెప్పడం కష్టం. ఎందుకంటే ఏ జట్టు ఎప్పుడు ఎవరిని ఓడిస్తుందో తెలియడం లేదు. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2022కి(IPL 2022 FINAL )ప్లే ఆఫ్స్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో మే 24న క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరుగుతుంది. 25న కోల్ కతా లోనే ఎలిమినేటర్ మ్యాచ్ కొనసాగుతుంది. 27న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ -2 మ్యాచ్ జరుగుతుంది.
29న ఇక్కడే ఐపీఎల్ ఫైనల్ కొనసాగుతుందని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు 100 శాతం మంది ప్రేక్షకులకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఇక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ నెంబర్ వన్ లో ఉంటే, లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Also Read : చుక్కలు చూపించిన లివింగ్ స్టోన్