IPL Media Rights : రూ. 42,000 కోట్లు దాటిన ఐపీఎల్ వేలం
రికార్డు స్థాయిలో మీడియా, డిజిటల్ రైట్స్
IPL Media Rights : భారత దేశ క్రీడా చరిత్రలో ఇది ఊహించని రికార్డ్ గా చెప్పక తప్పదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో
నిర్వహిస్తూ వస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL Media Rights) (ఐపీఎల్ ) ఐదేళ్ల కాలానికి గాను డిజిటల్, మీడియా రైట్స్, కోసం ఈ వేలం ద్వారా బిడ్ చేపట్టింది.
ఇదిలా ఉండగా క్రీడా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఏకంగా టీవీ, డిజిటల్ హక్కులు(IPL Media Rights) కలిపి బిడ్ ధర రూ. 42,000 వేల కోట్లు దాటడం విశేషం. 2023 నుంచి 2027 వరకు గాను ఈ వేలం ఆదివారం ప్రారంభమైంది.
ఇప్పటికే ఈ వేలం పాట నుంచి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ , టెక్ దిగ్గజం గూగుల్ తప్పుకున్నాయి. ఈ డిజిటల్, మీడియా రైట్స్ కు
సంబంధించి నాలుగు ప్యాకేజీలుగా విభజించింది బీసీసీఐ.
వీటిని ఎ, బి, సి, డి గా ఏర్పాటు చేసింది. ఐదేళ్ల కాలానికి గాను ఒక్కో సీజన్ కు 74 మ్యాచ్ లకు గాను ఇ – వేలం నిర్వహిస్తున్నారు. చివరి రెండేళ్ల
కాలానికి మ్యాచ్ ల సంఖ్యను 94కి పెంచే నిబంధన ఉంది.
ప్యాకేజీ ఎ – అనేది భారత ఉప ఖండం కోసం టీవీ కోసం ప్రత్యేకం. ఇక బి – ప్యాకేజీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వేలం పాట చేపట్టింది. కాగా టీవీ,
డిజిటల్ కు ఒక్కో మ్యాచ్ ధర ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పెరిగిందని సమాచారం.
ఇక ప్యాకేజీ సి – అనేది ప్రతి సీజన్ లో ఎంచుకున్న గేమ్ ల కోసం అయితే ప్యాకేజీ డి అనేది అన్ని మ్యాచ్ ల కోసం నిర్వహిస్తున్నారు. టీవీ,
డిజిటల్ రైట్స్ విదేశీ మార్కెట్ ల కోసం చేపడుతోంది.
ఈ వేలం పాట రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈనెల 13తో పూర్తవుతుంది.
Also Read : ఐపీఎల్ కు భారీ ఆదాయం – గంగూలీ