IPL Media Rights : రికార్డు ధ‌ర‌కు ఐపీఎల్ మీడియా రైట్స్

రూ. 44,075 కోట్ల‌కు సోనీ, జియో ప‌రం

IPL Media Rights : భార‌తీయ క్రీడా చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్. ఊహించ‌ని రీతిలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ ) నిర్వ‌హించిన ఐపీఎల్ మీడియా, డిజిట‌ల్ రైట్స్ వేలం పాట‌లో రూ. 44,075 కోట్లకు అమ్ముడు పోయాయి.

ఇది అరుదైన ఘ‌న‌త‌. కేవ‌లం 2023 నుంచి 2027 దాకా ఐదేళ్ల కాలానికి ఈ వేలం చేప‌ట్టారు. డిస్నీ స్టార్ టీవీ డీల్ ను రూ. 23, 575 కోట్ల‌కు చేజిక్కించు కోగా వ‌యా కామ్ 18 బ్యాగ్స్ డిజిట‌ల్ రూ. 20,500 కోట్ల‌కు పొందింది.

ఐదు సీజ‌న్ల‌లో 410 ఐపీఎల్ ప్యాకేజీ ఎ కింద భార‌త ఉప ఖండం టీవీ హ‌క్కులు విక్ర‌యించారు. ఒక్కో గేమ్ కు రూ. 57.5 కోట్లు. ఇది క్రీడా ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌నిక సంస్థ‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

వ‌చ్చే ఐదేళ్ల పాటు స్టార్ ఐపీఎల్ భార‌తీయ టీవీ హ‌క్కుల్ని క‌లిగి ఉంది. వ‌యాకామ్ 18 డిజిట‌ల్ హ‌క్కుల్ని(IPL Media Rights) చేజిక్కించుకుంది.

టీవీ, డిజిట‌ల్ రైట్స్(IPL Media Rights) నుండి ఒక్కో మ్యాచ్ విలువ క‌లిపి రూ. 107.5 కోట్లు. స్టార్ ను స‌వాల్ చేసిన వ‌యాకామ్ 18 ( ఉద‌య్ శంక‌ర్ , జేమ్స్ మ‌ర్డోచ్ లూపా సిస్ట‌మ్స్ తో ) ఒక్కో గేమ్ రూ. 50 కోట్ల‌తో భార‌త ఉప ఖండం డిజిట‌ల్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది.

ఈ రెండింటిని విక్ర‌యించ‌డం ద్వారా బీసీసీఐ ఆదాయం అమాంతంగా పెరిగింది. మొత్తం వాల్యూ రూ. 44, 057 కోట్లు కావ‌డం విశేషం. 2018లో వేసిన వేలం విలువ రూ. 16,347 కోట్లు ఉంటే ఈసారి రెండున్న‌ర రెట్లు ఎక్కువ పెరిగింది.

ఇదిలా ఉండ‌గా టీవీ బేస్ ధ‌ర రూ. 49 కోట్లు కాగా డిజిట‌ల్ రైట్స్(IPL Media Rights) ధ‌ర రూ. 33 కోట్లుగా నిర్ణ‌యించింది బీసీసీఐ.

Also Read : ఐపీఎల్ రైట్స్ ద‌క్కించుకున్న సోనీ..జియో

Leave A Reply

Your Email Id will not be published!