IPL 2023 Auction : డిసెంబర్ 16న ఐపీఎల్ మెగా వేలం
బీసీసీఐ గంగూలీ రాష్ట్ర సంస్థలకు లేఖ
IPL 2023 Auction : 2023లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మెగా రిచ్ లీగ్ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ను నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఈ మేరకు బీసీసీఐ చివరి చీఫ్ సౌరవ్ గంగూలీ వెళుతూ వెళుతూ దేశంలోని ఆయా రాష్ట్రాల క్రికెట్ సంస్థలకు లేఖలు రాశారు.
ఇందులో డిసెంబర్ 16న ఐపీఎల్ మెగా వేలం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోసారి బెంగళూరు వేదికగా ఈ వేలం జరగనుంది. గతంలో ఎనిమిది జట్లు ఐపీఎల్ లో పాల్గొనగా 2022లో జరిగిన ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొన్నాయి. గుజరాత్ లయన్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
రన్నరప్ గా కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు పది ఐపీఎల్ జట్లు ఐపీఎల్ 2023లో స్వదేశంలో, బయటి ఫార్మాట్ లో ఆడతాయి. గత ఏడాది మెగా వేలం జరగగా ఈ ఏడాది ఆటగాళ్ల సంఖ్య పరంగా వేలం జరగనుంది.
ఇక మెగా వేలం ఐపీఎల్ (IPL 2023 Auction) ఫ్రాంచైజీల వేతన పర్స్ రూ. 5 కోట్ల మేర పెరగవచ్చని సమాచారం. ఇక జీతాల పర్స్ రూ. 90 కోట్లు కాగా రూ. 95 కోట్లకు పెరగవచ్చని అంచనా. ఇక ఇప్పటి వరకు పురుషుల ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పురుషుల ఐపీఎల్ కు ధీటుగా మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. 2023 ఆరంభంలో ప్రారంభ సీజన్ ను ప్రారంభించే చాన్స్ ఉందన్నారు సౌరవ్ గంగూలీ.
Also Read : దాదా పనితీరుపై విమర్శలు సరికాదు – ధుమాల్