IPL Retention List : ఆటగాళ్లకు షాక్ ఫ్రాంచైజీల విడుదల
కేన్..మయాంక్..మిచెల్..క్వానో..జేసన్
IPL Retention List : వచ్చే ఏడాది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2023 కొనసాగనుంది. ఇందు కోసం ఫ్రాంచైజీలు(IPL Retention List) తమ ఆటగాళ్లను విడుదల చేస్తున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ వదులుకుంది. డ్వేన్ బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసింది.
ముంబై ఇండియన్స్ కు చెందిన కీరన్ పోలార్డ్ పదవీ విరమణ ప్రకటించారు. విండీస్ బ్యాటింగ్ కోచ్ గా నియమితులయ్యాడు. ఇక ఐపీఎల్ లీగ్ 16వ ఎడిషన్ ఇది. డిసెంబర్ 23న కొచ్చిలో ఆటగాళ్లకు సంబంధించి మినీ వేలం జరగనుంది.
ఇక మినీ వేలానికి ముందు టీమ్ లు రిటైన్ చేసిన , రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాను ప్రకటించేందుకు చివరి రోజు నవంబర్ 15. వేలానికి ముందు ఎస్ఆర హెచ్ వద్ద 42.25 కోట్లు మిగిలాయి. ఇక మయాంక్ అగర్వాల్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విడుదల చేసింది.
గుజరాత్ టైటాన్స్ పేలవమైన ఫామ్ కారణంగా జేసన్ రాయ్ ను వదులుకుంది. రాజస్థాన్ రాయల్స్ దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ , కీవీస్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను రిలీజ్(IPL Retention List) చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ షారుఖ్ ఖాన్ ను ఉంచుకుంది. స్మిత్ ను విడుదల చేసింది. నికోలస్ పూరన్ ను పెట్టుకుంది.
పడిక్కల్ ను రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. కోచ్ సంగక్కర మద్దతు తెలిపాడు. అతడిని రూ. 7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆరోన్ ఫించ్ , శివమ్ మావిలను విడుదల చేసింది. ఇక పాట్ కమిన్స్ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఇక రవీంద్ర జడేజా విషయంపై ఇంకా సీఎస్కే వెల్లడించలేదు. లాకీ ఫెర్గుసన్ , రహ్మానుల్లా, జాసన్ , ఇతర ఆటగాళ్లు విడుదల చేసే యోచనలో ఉన్నాయి.
Also Read : అయ్యో నటాషా పాక్ ఓటమిపై నిరాశ