WIvsIRE : చెల‌రేగిన ఐరీష్‌ త‌ల‌వంచిన విండీస్

32.3 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఛేదన

WI vs IRE : క్రికెట్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ప్ర‌ధానంగా టీ20, వ‌న్డే మ్యాచ్ ల‌లో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది చెప్ప‌డం అత్యంత క‌ష్టం.

ఇప్ప‌టి దాకా హాట్ ఫేవ‌రేట్ గా ఉన్న వెస్టిండీస్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది పిల్ల‌కూన‌గా పేరొందిన ఐర్లాండ్ టీం(WI vs IRE).

అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉన్న వెస్టిండీస్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది ఐర్లాండ్. సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి సీరీస్ పై ఆశ‌లు అలాగే ఉంచేలా చేసింది. మూడు వ‌న్డేల సీరీస్ లో భాగంగా మొద‌టి వ‌న్డేను

ఆతిథ్య విండీస్ చేజిక్కించు కోగా రెండో వ‌న్డే లో ఐర్లాండ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది.

మొద‌టి మ్యాచ్ లో వెస్టిండీస్ ఐర్లాండ్(WI vs IRE) పై 24 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఇక క‌రోనా దెబ్బ‌కు రెండో వ‌న్డేను వాయిదా వేసింది క్రికెట్ బోర్డు. ఈనెల 11న నిర్వ‌హించాల్సిన వ‌న్డే మ్యాచ్ ను 13కు మార్చింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఐర్లాండ్ స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పోలార్డ్ బృందం 229 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

వ‌ర్షం రావ‌డంతో డ‌క్ వ‌ర్త్ లూయీస్ రూల్ ప్ర‌కారం మ్యాచ్ ను 36 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో 168 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది ఐర్లాండ్.

ఈ ల‌క్ష్యాన్ని 32.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించి ఔరా అనిపించేలా చేశారు. దీనిని ఐర్లాంట్ జ‌ట్టు కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

దీంతో వ‌న్డే సీరీస్ ను 1-1 తో స‌మం చేసింది. ఇక మ్యాచ్ గెలుపులో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఆండీ మెక్ బ్రైన్ ను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్ర‌క‌టించారు.

మ‌రో వైపు ఐర్లాండ్ స్కిప్ప‌ర్ పాల్ స్టీరింగ్ వ‌న్డే కెరీర్ లో 5 వేల ర‌న్స్ సాధించిన మొద‌టి ఐరీష్ ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించ‌డం విశేషం.

Also Read : హిట్ మ్యాన్ స్ట‌న్నింగ్ లుక్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!