PM Modi Digital India : అన్నింటికీ ‘డిజిట‌ల్’ మంత్ర‌మేనా

ద్ర‌వ్యోల్బ‌ణం..నిరుద్యోగం మాటేంటి

PM Modi Digital India : నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలో స‌మూల మార్పులు చోటు చేసుకుంటాయ‌ని అంతా భావించారు. కానీ అందుకు విరుద్దంగా జ‌రిగింది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భార‌త దేశం స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడుతోంది. ప్ర‌ధానంగా జీఎస్టీ తీసుకు వ‌చ్చినా, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్ముతున్నా ఎందుక‌ని ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం , పేద‌రికం, ఆక‌లి కేక‌లు ఉన్నాయ‌నేది ఒక్క‌సారైనా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆలోచిస్తే మంచిది.

నీతి ఆయోగ్ అన్నారు నీరుగారి పోతోంది.మోదీ ఎక్క‌డ‌కు వెళ్లినా డిజిట‌లైజేష‌న్(PM Modi Digital India) జ‌పం చేస్తున్నారు. ప్ర‌తి చోటా దేశం ముందంజ‌లో కొన‌సాగుతోంద‌న్నారు. ప్ర‌ధాన రంగాలు కునారిల్లి పోతున్నాయి. ఓ వైపు చైనా నిర్మాణాత్మ‌క‌మైన రీతిలో అడుగులు వేస్తోంది.

యావ‌త్ ప్ర‌పంచం త‌నపై ఆధార‌ప‌డేలా వ‌స్తు ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తోంది. ఇవాళ మొబైల్స్ త‌యారీ రంగంలో మార్కెట్ ప‌రంగా అత్య‌ధిక వాటాను చైనా క‌లిగి ఉంది. కానీ భార‌త్ ఎందుక‌ని ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదో ఆలోచించాలి.

అపార‌మైన మాన‌వ వ‌న‌రులు ఉన్నా వాటిని స‌కాలంలో గుర్తించి అవ‌కాశాలు క‌ల్పించక పోవ‌డం వ‌ల్ల‌నే ఇక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు మేధో వ‌ల‌స ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఇత‌ర దేశాల‌లో కొలువుతీరేందుకు పోటీ ప‌డుతున్న వారిలో అత్య‌ధికంగా భార‌తీయులు ఉన్నారు.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం మౌలిక వ‌స‌తులైన విద్య‌, వైద్యం, ఉపాధి, మహిళా సాధికార‌త ప‌డ‌కేసింది. వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కే పెద్ద‌పీట వేస్తూ పోతే చివ‌ర‌కు ఎకాన‌మీపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌న్న‌ది గుర్తించాలి. లేక పోతే ప్ర‌మాదం.

దేశ ఆర్థిక అభివృద్దిలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న వ్య‌వ‌సాయ‌, అద‌న‌పు రంగాల‌ను పూర్తిగా విస్మ‌రించడం ఒక ర‌కంగా ఇబ్బంది క‌లిగించే అంశం. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , టెలికాం రంగాల‌లో భార‌త్ గ‌ణ‌నీయ‌మైన వృద్దిని, ప్ర‌భావాన్ని చూపిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మొత్తంగా ఇలా ఎంత కాలం డిజిట‌లైజేష‌న్ జ‌పం చేస్తూ పోతార‌నేది మోదీనే(PM Modi Digital India) చెప్పాలి. దేశంలో ఏ చిన్న లేదా పెద్ద స‌మ‌స్య ఎదురైనా డిజిట‌ల్ మంత్రాన్ని ప‌ఠించ‌డం అల‌వాటుగా మారింది ప్ర‌ధానికి. మ‌న్ కీ బాత్ స‌రే..కానీ అట్ట‌డుగున ఉన్న ప్ర‌జ‌ల ఆక‌లి కేక‌ల‌ను కూడా గుర్తిస్తే మంచిది.

Also Read : రూ. 2,000 నోట్ల‌ ఊసేది ఆర్బీకి దిక్కేది

Leave A Reply

Your Email Id will not be published!