Ishan Kishan : ఇరగ దీసిన ఇషాన్ బంగ్లా పరేషాన్
వన్డేల్లో డబుల్ సెంచరీతో రికార్డ్
Ishan Kishan : ఇషాన్ కిషన్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ఏకంగా వన్డేలో డబుల్ సెంచరీతో రెచ్చి పోయాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారతీయ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో దుమ్ము రేపాడు కిషన్. కేవలం 126 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
ఇందులో 23 ఫోర్లు 9 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా శతకాన్ని కేవలం 85 బంతుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత రెండో సెంచరీని చేసేందుకు 41 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. వన్డేల చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా ఇంతకు ముందు ఇదే ఫార్మాట్ లో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ 138 బంతులు ఎదుర్కొని జింబాబ్వేతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. శనివారం జరిగిన కీలక వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఇషాన్ కిషన్(Ishan Kishan) 126 బాల్స్ మాత్రమే ఆడాడు. అలవోకగా డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
కాగా గతంలో భారత జట్టు తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ , వీరేంద్ర సెహ్వాగ్ , రోహిత్ శర్మలు ఉన్నారు. అయితే ఈ ముగ్గురు క్రికెటర్లు ఎక్కువ బాల్స్ తీసుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం తక్కువ బంతులు మాత్రమే ఉపయోగించడం విశేషం.
ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో బంగ్లాదేశ్ భారత్ కు చుక్కలు చూపించింది. వన్డే సీరీస్ కైవసం చేసుకుంది.
Also Read : సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ