Ishan Kishan : ఇషాన్ కిషన్ రాణించినా తప్పని ఓటమి
5 పరుగుల తేడాతో ముంబై పరాజయం
Ishan Kishan : ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో సత్తా చాటాడు. మరోసారి తన షాట్స్ తో అలరించాడు. ముందుగా బ్యాటింగ్ చేసింది లక్నో. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. కెప్టెన్ కృనాల్ పాండ్యా 49 రన్స్ చేసి రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు.
కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక మార్కస్ స్టోయినిస్ అయితే పిచ్చ కొట్టుడు కొట్టాడు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఎక్కడ పడితే అక్కడ షాట్స్ కొడుతూ అలరించాడు. ఏకంగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. అనంతరం 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ 37 పరుగులు చేస్తే ఇషాన్ కిషన్ 59 పరుగులతో దుమ్ము రేపాడు.
ఇద్దరూ కలిసి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔట్ అయ్యాక వచ్చిన సూర్య కుమార్ యాదవ్ నిరాశ పరిచాడు. కేవలం 7 పరుగులే చేశాడు. ఆఖరులో వచ్చిన టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నా తన జట్టును గెలిపించ లేక పోయాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక ఇషాన్ కిషన్ 161.28 స్ట్రైక్ రేట్ తో 39 బంతులు ఎదుర్కొని 1 సిక్స్ 8 ఫోర్లతో 59 రన్స్ తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఓటమి తప్పలేదు ముంబైకి.
Also Read : Krunal Pandya
