Ishant Sharma : తిప్పేసిన ఇషాంత్ తల్లడిల్లిన గుజరాత్
ఆఖరి ఓవర్ లో మ్యాజిక్ చేసిన ఢిల్లీ బౌలర్
Ishant Sharma : పొట్టి ఫార్మాట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఇషాంత్ శర్మ.
లీగ్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్, ఢిల్లీ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. అనంతరం స్వల్ప స్కోర్ టార్గెట్ తో బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్. పాండ్యా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా , 59 రన్స్ చేసినా చివరి దాకా ఉన్నా జట్టును గెలిపించ లేక పోయాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్ సత్తా చాటాడు. కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఓవర్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేస్తే పేస్ స్పియర్ హెడ్ అన్రిచ్ నార్ట్జే 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ప్రమాదకరమైన శుభ్ మన్ గిల్ ను 6 పరుగులకే పెవిలియన్ పంపించాడు.
ఇక వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మ్యాచ్ గెలవాలంటే 20వ ఆఖరి ఓవర్ లో 12 పరుగులు కావాలి గుజరాత్ టైటాన్స్ కు. అటు వైపు స్టార్ ఆల్ రౌండర్ ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నా ఫలితం లేక పోయింది. చివరి ఓవర్ ను ఇషాంత్ శర్మ వేశాడు. గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Also Read : చుక్కలు చూపించిన షమీ