Chandrababu Support : చలో రాజమండ్రి ఉద్రిక్తం
చెక్ పోస్టుల వద్ద పోలీస్
Chandrababu Support : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారణ చేపట్టింది. బాబును అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అటు తెలంగాణలో ఇటు ఏపీలో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
Chandrababu Support from IT Employees
చంద్రబాబు నాయుడును అరెస్ట్ కు సంఘీభావంగా ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు ఐటీ ఎంప్లాయిస్. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. తెలంగాణ ఏపీ సరిహద్దులో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గరికపాడు, అనుమంచిపల్లి వద్ద పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.
విజయవాడ వైపు వెళ్లే కార్లను ఆపి తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ నిలిపి వేస్తున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. తప్పు చేసిన వాళ్లకు ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. రూ. 371 కోట్లు ఎక్కడకు వెళ్లాయనే దానిపై ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
Also Read : Nagendra Babu : జనసేన కార్యకర్తలే పార్టీకి బలగం