IT HUB Nalgonda : న‌ల్ల‌గొండ‌లో ఐటీ హ‌బ్ రెడీ

వెల్ల‌డించిన మంత్రి కేటీఆర్

IT HUB Nalgonda : ఐటీ రంగంలో తెలంగాణ దూసుకు పోతోంది. డైన‌మిక్ లీడ‌ర్ గా గుర్తింపు పొందిన ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడైతే ఐటీ శాఖ‌కు మంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచి ఐటీ సెక్టార్ కు భారీ మ‌ద్ద‌తు ల‌భించింది.

IT HUB Nalgonda Will be Open

గ‌తంలో కొద్ది మందితో కొలువు తీరిన ఐటీ రంగం ఇవాళ రెండున్న‌ర ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగుల‌కు ఛాన్స్ ఇస్తోంది. ఇదంతా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం, ఐటీ ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం క‌లిసి వ‌చ్చేలా చేసింది.

హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇత‌ర ప‌ట్ట‌ణాల‌లో కూడా ఐటీ హ‌బ్ ల‌ను విస్త‌రించేందుకు కేటీఆర్ కృషి చేశారు. ఇక టైర్ -2 ప‌ట్ట‌ణాలలో ఐటీ రంగాన్ని అభివృద్ది చేసేందుకు తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ , ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ , మ‌హ‌బూబ్ న‌గ‌ర్, సిద్దిపేట‌, నిజామాబాద్ ల‌లో ఇప్ప‌టికే ఐటీ హ‌బ్ ల‌ను భారీ ఖ‌ర్చు తో తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం న‌ల్ల‌గొండ‌లో సైతం ఐటీ హ‌బ్ ప్రారంభం అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ విష‌యాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదికగా వెల్ల‌డించారు.

Also Read : JP Nadda : కుటుంబాల కోస‌మే ఇండియా కూట‌మి

Leave A Reply

Your Email Id will not be published!