Kapil Dev : టీమిండియా సెమీస్ కు చేరడం కష్టం
మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్
Kapil Dev : ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ కొనసాగుతోంది. భారత జట్టు వార్మప్ మ్యాచ్ లో ఆసిస్ పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మరో వైపు దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి లీగ్ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది.
ఇదిలా ఉండగా మెగా టోర్నీపై తాజా, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు తెలియ చేస్తున్నారు. ఏ జట్టు ఈసారి వరల్డ్ కప్ ను ఎగరేసుకు పోతుందని. ఇప్పటికే భారత జట్టు మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయని జోష్యం చెప్పాడు.
వాటిలో భారత్, పాకిస్తాన్ , ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు వస్తాయని తెలిపాడు. తాజాగా బుధవారం యూపీలోని లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు మాజీ భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev). షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియాపై. భారత జట్టు సెమీస్ కూడా చేరుకోవడం చాలా కష్టమన్నాడు.
30 శాతం మాత్రమే తనకు నమ్మకం ఉందన్నాడు. అంటే ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు హాట్ ఫెవరేట్ గా ఉన్న భారత జట్టు పై కపిల్ దేవ్ ఇలా కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. నెటిజన్లు కూడా విస్తు పోతున్నారు. ఎందుకిలా అని కొందరు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు కపిల్ దేవ్.
సెమీస్ మాటేమిటో కానీ సూపర్ -4 కు చేరగలదా అనేదే అసలైన సమస్య అని పేర్కొన్నాడు మాజీ కెప్టెన్.
Also Read : బీసీసీఐ కీలక నిర్ణయాలు ఇవే