Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన ప్రధానంగా బీసీసీఐ సెలక్టర్లకు చురకలు అంటించాడు.
రాబోయే రోజుల్లో భారత్ మెరుగైన పనితీరుతో పాటు విజయాలు సాధించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. లేక పోతే ఆడని వాళ్లను నెత్తిన పెట్టుకుంటే మిగిలేది అపజయాలేనని స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియా మూడు వన్డే మ్యాచ్ లతో పాటు 2 టెస్టులు ఓడి పోయి వన్డే, టెస్టు సీరీస్ కోల్పోయింది. ఉట్టి చేతులతో భారత్ కు తిరిగి వచ్చింది.
ఈ తరుణంలో ఎంత పెద్ద ఆటగాళ్లయినా సరే ఆడక పోతే లేదా ఫామ్ లో లేక పోతే జాలి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
వెంటనే ఎవరు ఆడడం లేదో పక్కన పెట్టేయాలని అన్నాడు. త్వరలో వరుసగా ఐసీసీ టోర్నీలు ఉన్నాయని ఈ తరుణంలో అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్లేయర్ల ఎంపికలో ఎంత మాత్రం నిర్లక్ష్యం పనికి రాదన్నాడు. ప్రధానంగా భువనేశ్వర్ కుమార్ ఆట తీరును తప్పు పట్టాడు. గతంలో లాగా ఆ కసి కనిపించడం లేదన్నాడు.
అతడిని తప్పించడం మంచిందని పరోక్షంగా సూచించాడు సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar). దీపక్ చాహర్ ను ఎక్కువగా ఆడించాలన్నాడు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6న విండీస్ తో సీరీస్ స్టార్ట్ కానుంది. ఆటగాళ్లు అహ్మదాబాద్ కు ప్రయాణం అయ్యారు.
Also Read : ధోనీపై భజ్జీ సంచలన కామెంట్స్