IT Raids : సీపీఆర్..ఆక్స్ ఫామ్..ట్రస్ట్ లపై ఐటీ దాడులు
గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు విరాళాలు
IT Raids : కేంద్ర ఆదాయపు పన్ను శాఖ జూలు విదిల్చింది. థింక్ ట్యాంక్ గా పేరొందిన సీపీఆర్, ఆక్స్ ఫామ్ , ట్రస్ట్ దట్ ఫండ్స్ మీడియా సంస్థలపై విస్తృతంగా దాడులు చేపట్టింది.
గత 24 గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా విలువైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.
ప్రభుత్వాలను ప్రశ్నించే పరిశోధనాత్మక కథనాలకు పేరొందిన కొన్ని మీడియా సంస్థలకు బెంగళూరుకు చెందిన ఐపీఎస్ఎంఎఫ్ ట్రస్ట్ నిధులు సమకూరుస్తోంది.
ఇక ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ గా పేరొందింది సీపీఆర్.
ఇదే సమయంలో ఛారిటీ ఆర్గనైజేషన్ ఆక్స్ ఫామ్ ఇండియా ఢిల్లీ ఆఫీసులో సోదాలు చేపట్టింది ఐటీ శాఖ(IT Raids). గత కొంత కాలంగా ఇండిపెండెంట్ , పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ ద్వారా దేశంలోని పలు పత్రికలు, మీడియా సంస్థలు, డిజిటల్ ఫార్మాట్ లో నడుస్తున్న వాటికి ఫండింగ్ సమకూరుస్తోంది.
ది కారవాన్ , ది ప్రింట్ , స్వరాజ్య వంటి అనేక డిజిటల్ మీడియా మాధ్యమాలకు పాక్షికంగా నిధులు సమకూర్చినట్లు గుర్తించింది ఐటీ శాఖ.
హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ లతో పాటు ఇతర ప్రదేశాలలో 20 కంటే ఎక్కువ గుర్తింపు లేని రాజకీయ పార్టీల నిధులపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విదేశీ విరాళాలు అందుకున్న వాటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.
ఇదిలా ఉండగా ది కారవాన్ లో 2002 గుజరాత్ అల్లర్లలో పీఎం మోడీకి ఎలాంటి పాత్ర లేదని దర్యాప్తు నివేదికను ప్రశ్నించింది.
Also Read : ఉమ్మడి పోరాటం బీజేపీపై యుద్దం – నితీశ్