Mallikarjun Kharge : స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయ‌డం మా హ‌క్కు- ఖ‌ర్గే

కాద‌నేందుకు కేంద్రానికి అధికారం లేదు

Mallikarjun Kharge : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ ప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే(Mallikarjun Kharge) షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. పార్ల‌మెంట్ ఎందుకు ఉంద‌నేది కేంద్రానికి తెలియ‌డం లేన‌ట్టుంది.

లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ ఉన్న‌ది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డానికి, నిల‌దేసేందుకు. కానీ మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించ‌డాన్ని త‌ట్టుకోలేక పోతోంద‌న్నారు.

ప‌దే ప‌దే అడ్డుత‌గులుతూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని, ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ‌గా అభివ‌ర్ణించారు మ‌ల్లికార్జున ఖ‌ర్గే.

పార్ల‌మెంట్ లో ప్ర‌శ్నించ‌డం అన్న‌ది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. ఇది ఎంపీల‌కు భార‌త రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు. దానిని కూడా తీసి వేస్తామంటే ఎలా. ఇంకెందుకు త‌మ‌ను ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ద‌ని నిల‌దీశారు ఖ‌ర్గే.

ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శ్నించాల‌ని అనుకుంటున్నార‌. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి, దేశానికి సంబంధించి, కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న వాటి గురించి క‌చ్చితంగా తెలుసు కోవాల‌ని అనుకుంటారు.

ప్ర‌భుత్వం అన్నాక జ‌వాబుదారీగా ఉండాలి కానీ ఆన్స‌ర్స్ ఇవ్వ‌కుండా దౌర్జ‌న్యం చేస్తామంటే కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఖ‌ర్గే. బీజేపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప్పుడు ర‌చ్చ చేయ‌డం కూడా ప్ర‌జాస్వామ్యంలో భాగ‌మ‌ని చెప్పే వారు.

కానీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ఆ విష‌యాన్ని వారు మ‌రిచి పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు ఖ‌ర్గే. విచిత్రం ఏమిటంటే తాము క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

Also Read : ఎంపీల 50 గంట‌ల నిర‌వ‌ధిక నిర‌స‌న

Leave A Reply

Your Email Id will not be published!