Shreyas Iyer : వారెవ్వా అయ్యారే అయ్య‌ర్

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్కిప్ప‌ర్

Shreyas Iyer  : భార‌త క్రికెట్ ఆట‌గాళ్ల‌కు పంట పండుతోంది. ఒక‌ప్పుడు జ‌ట్టులోకి రావాలంటే నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చేది. ఏ ముహూర్తాన ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందో ఆ నాటి నుంచీ నేటి దాకా కాసులు కురిపిస్తోంది.

నిన్న‌టి దాకా అనామ‌కులైన వాళ్లంతా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. నిన్న పానీ పూర అమ్ముకుంటున్న తండ్రికి చేదోడుగా ఉన్న ప్లేయ‌ర్ ఇవాళ దేశ‌మంతా చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేశాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో క్రికెట‌ర్ ది ఒక్కో టేస్ట్. తాజాగా ఐపీఎల్ లో భాగంగా కొంద‌ర్ని రిటైన్ చేసుకోలేదు కొన్ని ఫ్రాంచైజీలు. ఇందులో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా అందులో ఉన్నాడు.

ఇక ఐపీఎల్ 2022 సీజ‌న్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer )ను తీసుకోలేదు. శ్రేయ‌స్ ను ద‌క్కించు కునేందుకు చాలా ఫ్రాంచైజీలు పోటీ ప‌డ‌నున్నాయి.

ఇదే స‌మ‌యంలో కొత్త‌గా ఎంట‌ర్ అయిన అహ్మ‌దాబాద్ జ‌ట్టుకు అత‌డు కెప్టెన్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం శ్రేయ‌స్ అయ్య‌ర్ కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌బోతున్న‌ట్లు టాక్.

ఇంకో వైపు ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన ఇయాన్ మోర్గాన్ ను రీటైన్ చేసుకోలేదు. దీంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ పై క‌న్ను వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే కేకేఆర్ యాజ‌మాన్యం అత‌డితో సంప్ర‌దింపులు కూడా జ‌రిపిన‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ యాజ‌మాన్యం పంత్ వైపు మొగ్గింది కానీ శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ప‌క్క‌న పెట్టింది.

Also Read : భార‌త్ ను త‌లెత్తుకునేలా చేశా

Leave A Reply

Your Email Id will not be published!