Jacqueline Fernandez ED : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఈడీ షాక్
రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలు
Jacqueline Fernandez ED : ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన కామెంట్స్ చేసింది. బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
రూ. 200 కోట్ల రూపాయల భారీ దోపిడీ ఆరోపణలు ఎదుర్కొన్న సుకేష్ చంద్రశేఖర్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ప్రమేయం ఉన్నట్లు తేల్చింది.
కుండ బద్దలు కొట్టింది. దోపిడీ కేసులో మనీ ట్రయల్ ను విచారిస్తున్న ఈడీ ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ లో నటిని నందితురాలిగా పేర్కొంది.
అంతకు ముందు ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez ED) ఆస్తులను అటాచ్ చేసింది. ఆమెను కూడా ఇందుకు సంబంధించి ప్రశ్నించింది.
గత ఏప్రిల్ లో ఏజెన్సీ మనీ లాండిరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నటుడికి సంబంధించిన రూ. 7 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా స్తంభింప చేసింది.
సుకేష్ చంద్రశేఖర్ నుండి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు రూ. 5.71 కోట్ల విలువైన వివిధ బహుమతులు ఇచ్చాడని వెల్లడించింది.
చంద్రశేఖర్ ఈ కానుకలను ఇచ్చేందుకు తన దీర్ఘకాలిక సహచరురాలు, నిందితురాలిగా ఉన్న పింకీ ఇరానీని వాడారని ఈడీ పేర్కొంది. ఈ విషయం గురించి తన ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు అందజేసిన బహుమతులలో రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.
ఫెర్నాండేజ్ కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చారని ఆరోపించింది.
Also Read : కాశ్మీరీ పండిట్లపై దాడులు దారుణం