Jacqueline Fernandez : ‘జాక్వెలిన్’ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ

బహ్రెయిన్ కు వెళ్లేందుకు దావా దాఖ‌లు

Jacqueline Fernandez : రూ. 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ త‌న‌కు విదేశాల‌కు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ కావాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తాజాగా త‌ను దాఖ‌లు చేసిన దావాను ఉప‌సంహ‌రించుకుంది.

ఈ విష‌యాన్ని గురువారం వెల్ల‌డించింది. ఆమె త‌రపు వాదిస్తున్న న్యాయవాది ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా కోర్టు విచార‌ణ‌లో ఉండ‌గా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ త‌ర‌పు న్యాయ‌వాది కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదేశాల‌కు వెళ్లాల‌న్న పిటిష‌న్ అభ్య‌ర్థ‌న‌ను వ్య‌తిరేకించారు.

ఆమె బహ్రెయిన్ కు వెళ్ల‌డం ఆచ‌ర‌ణీయం కాద‌ని పేర్కొన్నారు. గురువారం తెల్ల‌వారుజామున ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజ‌రయ్యారు.

ఇందులో భాగంగా ఢిల్లీ కోర్టు, ఈడీ అభ్య‌ర్థ‌న‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో న‌టి త‌న పేరెంట్స్ ను క‌లిసేందుకు బ‌హ్రెయిన్ కు వెళ్లేందుకు అనుమ‌తి కోరుతూ త‌న ద‌ర‌ఖాస్తును ఇవాళ ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు వెల్ల‌డించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) .

అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జి శైలేంద్ర మాలిక్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశం కీల‌క‌మైన ద‌శ‌లో ఉంద‌న్నారు. మీరు మీ త‌ల్లిని క‌ల‌వాల‌ని అనుకుంటున్నారు. నాకు అర్థ‌మైంది. మేమంతా మా పేరెంట్స్ ప‌ట్ల భావోద్వేగంతో ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇంత కీల‌క‌మైన స‌మ‌యంలో మీరు విదేశాల‌కు ఎందుకు వెళ్లాల‌ని ప్ర‌శ్నించారు న్యాయ‌మూర్తి.

ఇదిలా ఉండ‌గా మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి ఈడీ నిందితుల్లో ఒక‌రిగా జాక్వెలిన్ ను చేర్చింది.

Also Read : ఆల్ టైమ్ న‌టుల్లో బాద్ షా

Leave A Reply

Your Email Id will not be published!