Jadeja Hugs Wife : జ‌డేజా ఆనందం ఆలింగ‌నం

భార్య‌ను హ‌త్తుకున్న జ‌డేజా

Jadeja Hugs Wife : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ 2023 మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. 15 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ హిస్ట‌రీలో 5సార్లు ఛాంపియ‌న్ గా నిలిచిన జ‌ట్టుగా ఘ‌న‌త సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 214 ర‌న్స్ చేసింది. గిల్ 39 ర‌న్స్ చేస్తే సాయి సుద‌ర్శ‌న్ రెచ్చి పోయాడు. 96 ర‌న్స్ చేశాడు. 4 ప‌రుగుల తేడాతో సెంచ‌రీని కోల్పోయాడు.

అనంత‌రం మ్యాచ్ కు వ‌ర్షం ఆటంకంగా నిలిచింది. దీంతో అంపైర్లు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించారు. ఈ మేర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందు 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ టార్గెట్ నిర్ణ‌యించారు. మైదానంలోకి దిగిన సీఎస్కే ఎక్క‌డా త‌డ‌బాటుకు గురి కాలేదు. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే మ‌రోసారి దుమ్ము దులిపాడు. 47 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు. ఇక మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది.

చివ‌రి బంతి వ‌ర‌కు ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ రేపింది. ఈ త‌రుణంలో ఆఖ‌రి ఓవ‌ర్ లో రెండు బంతుల‌కు 10 ర‌న్స్ కావాల్సి వ‌చ్చాయి చెన్నైకి. ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) ఏమాత్రం ఆలోచించ‌కుండా సిక్స్, ఫోర్ కొట్టాడు. త‌న జ‌ట్టును ఛాంపియ‌న్ నిలిచేలా చేఢాడు. అనంత‌రం అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ర‌వీంద్ర జ‌డేజా ఉత్సాహం త‌ట్టుకోలేక త‌న భార్య‌ను హ‌త్తుకున్నాడు. ఆలింగ‌నం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Also Read: MS Dhoni

 

Leave A Reply

Your Email Id will not be published!