IND vs SL 1st Test : రవీంద్ర జడేజా దెబ్బకు శ్రీలంక బౌలర్లు పరేషాన్ లో పడ్డారు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజులో భారీ టార్గెట్ ప్రత్యర్థి ముందు ఉంచింది భారత్.
తన కెరీర్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు జడేజా. 175 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదటి రోజు ఆట రిషబ్ పంత్ ది అయితే రెండో రోజు ఆట మాత్రం పూర్తిగా రవీంద్ర జడేజాదేనని చెప్పక తప్పదు.
దీంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో భారీ రన్స్ ను ఛేదించే పనిలో పడింది శ్రీలంక.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా (IND vs SL 1st Test)6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. హనుమ విహారి 58 పరుగులు చేస్తే రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేశాడు.
ఇక తన 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 47 పరుగులు చేశాడు. శ్రీలంక తరపున సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజాను అవుట్ చేయాలని శ్రీలంక స్కిప్పర్ శతవిధాలుగా బౌలర్లను మార్చినా ఫలితం లేక పోయింది.
జడేజా 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారీ స్కోరు ముందుంచడంతో శ్రీలంక గడ్డు పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే భారత జట్టు అన్ని ఫార్మాట్ లలో బలంగా ఉంది.
అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ టాప్ లో నిలిచింది. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ లు తమ సత్తా చాటడంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆనందంలో ఉన్నాడు.
Also Read : కన్నీళ్లు తప్ప మాటలు లేవు