Jagadish Reddy : నీటి విషయంలో రాజీ పడం
స్పష్టం చేసిన జగదీశ్ రెడ్డి
Jagadish Reddy : సూర్యాపేట – నాగార్జున సాగర్ డ్యామ్ నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు గుండ్లకంట్ల జగదీశ్ రెడ్డి. ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. సాగర్ నీటి వివాదంపై మంత్రి స్పందించారు. డ్యామ్ విషయంలో మొదటి నుండి ఏపీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
Jagadish Reddy Comment
చంద్రబాబు పాలన నుంచి , ప్రస్తుతం జగన్ కొనసాగుతున్న సర్కార్ కావాలని తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోలింగ్ డే సందర్భంగా గురువారం సూర్యాపేటలో ఓటు వేశారు. అనంతరం జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) మీడియాతో మాట్లాడారు.
కేంద్రం కృష్ణా నీటి పంపకాలలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం కారణంగానే ఈ సమస్య ఇవాళ తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులు కోవడానికి సిద్దంగా లేరన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా నీటి పంపకం విషయంలో , విడుదలకు సంబంధించి పునరాలోచించాలని స్పష్టం చేశారు జగదీశ్ రెడ్డి.
కేసీఆర్ ఉన్నంత కాలం తమ హక్కుల్ని హరించడం ఎవరి వల్లా కాదన్నారు. నీటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు తమకు లేదన్నారు విద్యుత్ శాఖ మంత్రి.
Also Read : Daggubati Purandeswari : సాగర్ ఘర్షణ వెనుక రాజకీయం