Jagan Mohan Dalmia : భారత క్రికెట్ ను జనరంజకం చేసి ఆదాయ మార్గాలను పట్టించిన ఏకైక వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందిన జగన్మోహన్ దాల్మియా(Jagan Mohan Dalmia). క్రికెట్ కు ఉన్న పవర్ ఏంటో, దానిని ఎలా వాడు కోవాలో ఆచరణలో చేసి చూపించిన అరుదైన పాలనాదక్షుడు.
30 మే 1940లో పుట్టాడు. 20 సెప్టెంబర్ 2015లో చని పోయాడు. కోల్ కతా ఆయన స్వస్థలం. క్రికెట్ నిర్వాహకుడిగా, వ్యాపారవేత్తగా పేరొందారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా పని చేశాడు.
గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధ్యక్షుడిగా పని చేశాడు. జగన్మోహన్ దాల్మియా(Jagan Mohan Dalmia) బనియా కులానికి చెందిన మార్వాడీ కుటుంబంలో పుట్టాడు. వికెట్ కీపర్ గా ప్రారంభించాడు.
ప్రముఖ క్రికెట్ క్లబ్ ల ద్వారా ఆడాడు. ఆ తర్వాత బ్యాటర్ గా పేరొందాడు. తండ్రి మరణంతో 19 ఏళ్ల వయస్సులో తమ సంస్థ ఎంఎల్ దాల్మియా అండ్ కో బాధ్యతలు చేపట్టాడు.
1963లో కోల్ కతా బిర్లా ప్లానిటోరియంను నిర్మించారు. 1979లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐలో చేరారు.
1983లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఆయన బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. భారత్ లో వరల్డ్ కప్ చేపట్టేలా చేయడంలో దాల్మియా పాటుపడ్డాడు.
1991లో ఐసీసీలో దక్షిణాఫ్రికా ఆడేలా చేసిన ఘనత ఆయనదే. 1993లో బీసీసీఐ మ్యాచ్ లు ప్రసారం చేసేందుకు దూరదర్శన్ కు డబ్బులు చెల్లించింది. కానీ దానిని సమూలంగా మార్చేలా చేశాడు దాల్మియా.
1995లో వేలం పాట చేపట్టి అత్యధిక ధరకు విక్రయించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. బీసీసీఐకి మరింత ఆదాయం సమకూరింది. 1996లో వరల్డ్ కప్ తీసుకు వచ్చాడు. ప్రపంచ కప్ కోసం టీవీ హక్కుల కు గాను రికార్డు స్థాయిలో ఒప్పందం కుదిరింది.
ఇది దాల్మియా హయంలోనే జరిగింది. అదే ఏడాదిలో జరిగిన ఐసీసీ ఎన్నికల్లో దాల్మియాకు 23 ఓట్లు వచ్చాయి. 1997లో ఐసీసీ చీఫ్ గా ఎన్నికయ్యాడు. మూడేళ్ల పాటు పని చేశాడు.
మొదటి ఆసియా , మొదటి నాన్ క్రికెటర్ గా ఎన్నికైన వ్యక్తి ఆయనే కావడం విశేషం. ఐసీసీలో , బీసీసీఐలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు దాల్మియా.
Also Read : బీసీసీఐకి ఊపిరి పోసిన రాజ్ సింగ్