Jagan Mohan Rao : హెచ్‌సీఏ చీఫ్ గా జ‌గ‌న్మోహ‌న్ రావు

క్రికెట్ గుత్తాధిప‌త్యం బీఆర్ఎస్ లోకి

Jagan Mohan Rao : హైద‌రాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కు జ‌రిగిన అధికారిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జ‌గ‌న్ మోహ‌న్ రావు ఎన్నిక‌య్యారు. దీంతో గులాబీ జెండా ప‌రిధిలోకి క్రీడా సంస్థ వెళ్లి పోయింది. ఆయ‌న గెలుపుకు మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ క‌విత బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప‌లికారు.

Jagan Mohan Rao As a HCA Chief

చాలా తెలివిగా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ ను త‌ప్పించారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. మొత్తంగా ఇప్ప‌టికే రాష్ట్రాన్ని దివాలా తీయించిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఉన్న‌ట్టుండి భారీ ఆదాయం క‌లిగిన హెచ్ సీ ఏ లో కొలువు తీర‌డం విస్తు పోయేలా చేసింది.

ఇక జ‌గ‌న్ మోహ‌న్ రావు(Jagan Mohan Rao) తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. విద్యా వేత్త‌గా గుర్తింపు పొందారు. గెలుపొందిన ఆయ‌న ఈ విజ‌యం కేసీఆర్ గెలుపు అని పేర్కొన్నారు. స‌హ‌క‌రించిన కేటీఆర్, హ‌రీశ్, క‌విత‌క్క‌కు థ్యాంక్స్ తెలిపారు.

హెచ్‌సీఏ ఎన్నిక‌లు ఉత్కంఠ భ‌రితంగా సాగాయి. చివ‌ర‌కు జ‌గ‌న్ ఒక్క ఓటు తేడాతో గెలుపొంద‌డం విశేషం. ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి అమ‌ర్ నాథ్ పై విజ‌యం సాధించారు. నూత‌న చీఫ్ కు 63 ఓట్లు రాగా అమ‌ర్ నాథ్ కు 62 ఓట్లు వ‌చ్చాయి.

మొత్తం 173 ఓట్ల‌కు గాను 169 ఓట్లు పోల్ అయ్యాయి. మాజీ క్రికెట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. హెచ్ సీ ఏకు కొత్త పాల‌క వ‌ర్గం కొలువు తీరింది. అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడిగా దిల్జీత్ సింగ్ , కార్య‌ద‌ర్శిగా దేవ రాజ్ , సంయుక్త కార్య‌ద‌ర్శిగా బ‌స‌వ రాజు, కోశాధికారిగా శ్రీ‌నివాస రావు, కౌన్సిల‌ర్ గా సునీల్ కుమార్ ఎన్నిక‌య్యారు.

Also Read : Seats For Sale Comment : సీట్ల పంప‌కం కోట్ల‌ల్లో పందేరం

Leave A Reply

Your Email Id will not be published!