Jagga Reddy : కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. రేవంత్ నాయకత్వాన్ని ముందు నుంచీ ప్రశ్నిస్తున్న జగ్గారెడ్డి (Jagga Reddy)తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తామని చెప్పారు.
దమ్ముంటే తనపై గెలవాలని అన్నారు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆదివారం జగ్గారెడ్డి (Jagga Reddy)మీడియాతో మాట్లాడారు. గతంలో పార్టీలో ఓ పద్దతి అంటూ ఉండేదని కానీ ఇప్పుడు ఆ సిస్టం పూర్తిగా మారి పోయిందన్నారు.
తాను కోవర్టునంటూ రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తానేమిటో ప్రజలకు తెలుసన్నారు.
దమ్ముంటే తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు నిలబడినా సరే లేదా ఇంకెవరినైనా నిలబెట్టినా సరే గెలిచి చూపించాలన్నాడు.
ఒక వేళ నీవు కానీ నీ అభ్యర్థి కానీ గెలిస్తే ఇక నువ్వే హీరోవని కానీ నేను గెలిస్తే తానే హీరోనని అన్నారు. తమను సస్పెండ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు.
పార్టీకి విధేయులమే తప్పా వ్యతిరేకులం కాదన్నారు జగ్గారెడ్డి. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే చెబుతానని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా మినిష్టర్ హరీష్ రావును కలవడంలో తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామా చేస్తానని మరోసారి ప్రకటించారు జగ్గారెడ్డి. తన నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టి గెలిపిస్తే తాను హీరో అని ఒప్పుకుంటానని అన్నారు.
వీహెచ్ తన కూతురు సమస్య విషయంపై మంత్రిని కలిస్తే రాజకీయం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
Also Read : టీఆర్ఎస్ పతనం బీజేపీ విజయం