Jhanvi Kapoor : జూనియ‌ర్ తో జాన్వీ క‌పూర్ మూవీ ?

టాలీవుడ‌లో జోరుగా ప్ర‌చారం

Jhanvi Kapoor  : తెలుగు సినీ రంగంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మోస్ట్ పాపుల‌ర్ హీరో. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టించారు. ఆ చిత్రం పూర్త‌యింది. ప్ర‌మోష‌న్స్ కూడా న‌డిచాయి.

క‌రోనా కార‌ణంగా దానిని వాయిదా వేశారు. ఆ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే జ‌క్క‌న్న బాహుబ‌లి త‌ర్వాత ఈ మూవీ రావ‌డ‌మే. జూనియ‌ర్ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌తో దుమ్ము రేపాడు.

త‌న అద్భుత‌మైన మేన‌రిజాన్ని ప్ర‌ద‌ర్శించి స‌త్తా చాటాడు. ఆర్ఆర్ఆర్ లో కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో దివంగ‌త శ్రీ‌దేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ (Jhanvi Kapoor )న‌టిస్తుంద‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

త్రివిక్రం శ్రీ‌నివాస్ , పూరీ జ‌గ‌న్నాథ్ తీయ‌బోయే జ‌న గ‌ణ‌మ‌న సినిమాల్లో జూనియ‌ర్ స‌ర‌స‌న న‌టిస్తోందంటూ టాక్. టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుంద‌ని ప్ర‌చారం. ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

ఉప్పెన చిత్ర నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇది వ‌ర‌కే చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు క‌థ కూడా చెప్పాడ‌ని దానికి ఎన్టీఆర్ ఓకే చెప్పిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే చిత్ర‌, ద‌ర్శ‌కులు జాన్వీ క‌పూర్(Jhanvi Kapoor )తో సంప్ర‌దించిన‌ట్లు టాలీవుడ్ తెగ టాక్. అయితే ఆమె న‌టిస్తుందో లేదో ఇంకా ఇప్ప‌టికీ వివ‌రాలు తెలియ లేదు.

ఇటీవ‌ల జాన్వీ క‌పూర్ కూడా స్పందించింది. టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని ఇంకా క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. విచిత్రం ఏమిటంటే త‌ల్లి శ్రీ‌దేవితో తాత ఆడి పాడాడు.

Also Read : పెళ్లి కాకుండానే విడాకులు ఎలా

Leave A Reply

Your Email Id will not be published!