Jai Shankar : రష్యా, ఉక్రెయిన్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. భారత దేశం రక్తం చిందించడాన్ని ఒప్పుకోదని వెల్లడించారు.
దీని వల్ల మారణ హోమం జరగడం, ఆస్తుల విధ్వంసం తప్ప మరొకటి ఉండదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో బుచ్చా లో చోటు చేసుకున్న దారుణాలను , హత్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఇది చాలా తీవ్రమైన విషయం. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ ను తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. యావత్ ప్రపంచంలో ఏ దేశమైనా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తాము ఎవరితో యుద్దం కావాలని కోరుకోమన్నారు. అయితే తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోబోమన్నారు జై శంకర్(Jai Shankar ). భారత దేశం ఒకే వైపు ఉంటుందన్నారు.
అది ఎప్పటికీ శాంతి వైపు మాత్రమే ఉంటుందని గుర్తుంచు కోవాలన్నారు. ఇది తమ సూత్రప్రాయమైన వైఖరి అని మరోసారి స్పష్టం చేశారు.
అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్దం నివారించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఇండియా ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటే ఇరు వైపుల నుంచి సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు జై శంకర్(Jai Shankar ).
ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్తం చిందించడం ద్వారా , అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా పరిష్కారం లభించదన్నారు.
అంతర్జాతీయ చట్టానికి గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కోసం సమకాలీన ప్రపంచ క్రమం యూఎన్ చార్టర్ పై నిర్మించ బడిందన్న విషయాన్ని గుర్తుంచు కోవాలని అన్నారు.
Also Read : బీజేపీ అంటేనే చెప్పేది ఏదీ చేయదు