Satyendar Jain : స‌త్యేంద్ర జైన్ తో జైలు చీఫ్ ములాఖ‌త్

నెట్టింట్లో ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్

Satyendar Jain : ఆప్, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. ప్ర‌స్తుతం మ‌నీ లాండ‌రింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్(Satyendar Jain)  వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న‌కు మ‌సాజ్ చేయ‌డం, ఖ‌రీదైన భోజ‌నం వ‌డ్డించ‌డం నిన్న‌టి దాకా హ‌ల్ చ‌ల్ చేసింది.

తాజాగా మ‌రో వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. తీహార్ జైలులో ఉన్న జైన్ తో జైలు చీఫ్ ములాఖ‌త్ కావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబ‌ర్ 12 నుండి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో దాదాపు 10 నిమిషాల నిడివి క‌లిగిన వీడియో క్లిప్ ఉంది. సాధార‌ణ దుస్తుల‌లో ముగ్గురు వ్య‌క్తులు సంద‌ర్శించారు.

మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ విశ్రాంతి (రిలాక్స్ ) తీసుకుంటున్న‌ట్టు అందులో ఉంది. ఇదిలా ఉండా ప్ర‌స్తుతం ఢిల్లీలో మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దేశ రాజ‌ధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్ , కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం కొన‌సాగుతోంది.

ఈ త‌రుణంలో ఆప్ మంత్రికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం అవి వైర‌ల్ కావ‌డం కొంచెం ఇబ్బందిక‌రంగా మారాయి. అయితే ఆప్ వీటిని ఖండిస్తోంది. కావాల‌ని బీజేపీ ఆడుతున్న నాట‌కం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని ఆరోపిస్తోంది.

గుజ‌రాత్ , ఢిల్లీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆప్ కు రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంద‌ని దానిని త‌ట్టుకోలేకే కాషాయ శ్రేణులు దుష్ప్ర‌చారం చేస్తున్నాయంటూ మండి ప‌డింది. మొత్తంగా స‌త్యేంద‌ర్ జైన్(Satyendar Jain)  హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉండ‌గా మంత్రితో జైలు చీఫ్ ములాఖత్ కావ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read : ఎవ‌రీ ఆనంద్ తెల్తుంబ్డే ఏమిటా క‌థ‌

Leave A Reply

Your Email Id will not be published!