హైదరాబాద్ : అందరూ ఊహించినట్లుగానే సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కీ రోల్ పోషించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ జైలర్ -2 దుమ్ము రేపుతోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ తీసుకున్నారు. భారీ ధరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరో వైపు పండుగ సీజన్ కావడం, 12 రోజులకు పైగా సెలువులు రావడంతో ఇటు ఏపీలో అటు తెలంగాణలో ప్రేక్షకులు జైలర్ -2ను చూసేందుకు ఎగ బడుతున్నారు. ఇదే క్రమంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండలు కలిసి చాన్నాళ్ల గ్యాప్ తర్వాత రణబాలి మూవీలో నటించారు. ఈ సినిమా 16న విడుదలైంది. కానీ మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆశాజనకంగా ఉన్నాయి వసూళ్లు. దీంతో దసరా విజేతగా జైలర్ -2 నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా రజనీకాంత్ మేనరిజం, డైరెక్టర్ పనితనం సినిమా విజయానికి కారణమైంది.
తెలుగు బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో తనకు ఉన్న అపారమైన ప్రజాదరణను ఈ సీనియర్ స్టార్ మరోసారి నిరూపించుకున్నారు. మరోవైపు, విజయ్ దేవరకొండ నటించిన పీరియడ్ డ్రామా ‘రణబాలిలో ఒక శక్తివంతమైన పాత్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ కనిపిస్తారు. రష్మిక మందన్నతో ఆయనకు ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను అలరించినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయింది. ఈ దసరా పండుగ సీజన్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ‘రణబాలి’ కంటే రజనీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. “రజనీకాంత్ కు ఉన్న చరిష్మా, ప్రజాదరణ సాటిలేనివి అని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. గత కొన్ని రోజుల్లో ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయగా, ‘రణబాలి’ సుమారు 14 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టిందని ఆయన తెలిపారు. మరో వైపు నెగటివ్ టాక్ కూడా సినిమా పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
