Jainil Mehta Dance : న్యూయార్క్ స్ట్రీట్ లో పుష్ప సాంగ్ వైరల్
జైనిల్ మెహతా స్కర్ట్ తో చేసిన డ్యాన్స్ షేక్
Jainil Mehta Dance : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ ఇంకా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి.
బన్నీ కెరీర్ లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచి పోయింది. ఇక మూవీలోని సామి సామి సాంగ్ అయితే చెప్పాల్సిన పని లేదు.
చిన్నారుల నుంచి వృద్దుల దాకా అంతా ఈ పాటకు ఫిదా అయిన వారే. దీనిని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాస్తే మంగ్లీ చెల్లెలు పాడింది తెలుగులో. దీనిని మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి భారీ ఎత్తున జనాదరణ పొందింది. ఈ తరుణంలో తాజాగా అరుదైన సన్నివేశానికి వేదికగా మారింది అమెరికాలోని న్యూయార్క్ స్ట్రీట్. జైనిల్ మెహతా స్కర్ట్ (Jainil Mehta Dance)ధరించి సామి సామి సాంగ్ కు డ్యాన్స్ చేశాడు.
అతడు చేసిన డ్యాన్స్ తో కూడిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దీంతో మనోడు ఉన్నట్టుండి ఇప్పుడు వైరల్ గా మారాడు.
జైనిల్ మెహతా ఎవరో కాదు ముంబైకి చెందిన కొరియో గ్రాఫర్. ఘామ్రా దుస్తులు ధరించి చేసిన డ్యాన్స్ ఇప్పుడు హల్ చల్ సృష్టిస్తోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వందలాది మంది అతడి ఫోటోలను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. జైనిల్ మెహతా డ్యాన్స్ కు జనం అద్భుతం అంటూ కితాబు ఇవ్వడం విశేషం.
Also Read : బాలీవుడ్ బాద్షా సాంగ్ వైరల్