Jairam Ramesh : వంచ‌న‌కు మారు పేరు మోదీ – కాంగ్రెస్

నెహ్రూ త్రివ‌ర్ణ పతాకంపై పీఎం ట్వీట్

Jairam Ramesh : తాజాగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆనాటి ప్ర‌ధాని నెహ్రూ త్రివ‌ర్ణ పతాకం పై చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇది పూర్తిగా వంచ‌న త‌ప్ప ఇందులో ఏమీ లేద‌ని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ.

హ‌ర్ ఘ‌ర్ తిరంగ అనే నినాదంతో 75వ స్వాతంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో పౌరులు ఆగ‌స్టు 13 నుంచి 15 మ‌ధ్య వారి ఇళ్ల వ‌ద్ద త్రివ‌ర్ణ ప‌తాకాల‌ను ఎగుర వేయాల‌ని కోరుతున్నారు.

త్రివ‌ర్ణ ప‌తాకాన్ని జాతీయ జెండాగా స్వీక‌రించేందుకు దారి తీసిన అధికారిక స‌మాచారాన్ని ప్ర‌ధాని మోదీ పంచుకున్నారు. ఇదే స‌మ‌యంలో మోదీ నెహ్రూ త్రివ‌ర్ణ ప‌తాకంతో ముడిప‌డి ఉన్న చారిత్రక వాస్త‌వాన్ని పంచుకున్నందుకు మోదీపై కాంగ్రెస్ మండిప‌డింది.

దీనికి వంచ‌న జిందాబాద్ అని పేరు పెట్టింది. ఇళ్ల మ‌ధ్య‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర వేయాల‌ని లేదా ప్ర‌ద‌ర్శించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తూ నెహ్రూ ఆవిష్క‌రించిన మొద‌టి త్రివ‌ర్ణ ప‌తాకానికి సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi).

ఇవాళ జూలై 22న చ‌రిత్ర‌లో ఒక విశిష్ట‌మైన స్థానం ఉంది. 1947లో ఇదే రోజున మ‌న జాతీయ జెండాను ఆమోదించారు. త్రివ‌ర్ణ ప‌తాకం , పండిట్ నెహ్రూ ఆవిష్క‌రించిన మొదటి త్రివ‌ర్ణ ప‌తాకం ఇదేనంటూ పేర్కొన్నారు మోదీ.

ఈ ట్వీట్ల ప‌రంప‌ర‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు జైరాం ర‌మేష్(Jairam Ramesh) ఘాటుగా స్పందించారు. వంచ‌న జిందాబాద్ అంటూ ట్వీట్ చేశారు.

Also Read : శ్రీ‌లంక ప్ర‌ధానిగా దినేష్ గుణ‌వ‌ర్ద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!