Jairam Ramesh PM Modi : మోదీపై జైరాం రమేష్ కన్నెర్ర
నాగాలాండ్ సమస్యకు పరిష్కారమేది
Jairam Ramesh PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్. నాగాలాండ్ సమస్యకు పరిష్కారం ఏదని ప్రశ్నించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. మరోసారి ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు జైరాం రమేష్.
కాంగ్రెస్ ఎంపీ ప్రధానమంత్రిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలను ఈ సందర్బంగా ప్రస్తావించారు. హామీలు ఇవ్వడం వాటిని మరిచి పోవడం మోదీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు..ఇప్పుడు కొత్తగా మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వాగ్ధానాలు గుప్పిస్తున్నారంటూ ఆరోపించారు జైరాం రమేష్(Jairam Ramesh PM Modi). రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తున్న రాజకీయ సమస్యకు పరిష్కారం కాలేదన్నారు.
ఐదేళ్ల వరకు నాగాలాండ్ గురించి ప్రధానమంత్రి మోదీ పట్టించు కోలేదు. మరోసారి మోసం చేసేందుకు కొత్త వాగ్ధానాలను ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం పనిగాట పెట్టుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉంది. కానీ ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం చూపలేక పోయారంటూ ఫైర్ అయ్యారు.
నాగాలాండ్ లోని డిమాపూర్ లో జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. నాగాలాండ్ కు ప్రత్యేక జెండా కలిగి ఉంది. ఇది ప్రధానమైన సమస్య. దీనికి పరిష్కారం కనుగొనడంలో కేంద్రం విఫలమైందన్నారు .
Also Read : రాజస్థాన్ లో ఎన్ఐఏ దాడులు