Jairam Ramesh : మోదీ మౌనం వీడక పోతే ఎలా
కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్
Jairam Ramesh : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. శుక్రవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు జై రాం రమేష్(Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో ప్రతిసారి మోదీని ప్రశ్నించారు. ఈ దేశానికి చేసింది ఏమిటని నిలదీశారు. ఇందుకు సంబంధించి మోదీ తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేశారనే దానిపై ప్రశ్నిస్తూ వచ్చారని కానీ ఇప్పటి దాకా పీఎం మౌనం వీడడం లేదన్నారు. ప్రస్తుతం కొలువు తీరిన బీజేపీ సర్కార్ భారత రాజ్యాంగానికి విరుద్దంగా పని చేస్తోందని ధ్వజమెత్తారు జై రాం రమేష్.
ఆయన ప్రభుత్వం కొలువు తీరి ఇవాల్టితో తొమ్మిది ఏళ్లవుతోంది. కానీ ఇప్పటి దాకా ఏ ఒక్క దానిని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. కానీ కనీసం ఇప్పటి వరకు 10 లక్షల జాబ్స్ సాధ్యం కాలేదన్నారు. నల్ల ధనం వెలికి తీస్తానని ప్రగల్బాలు పలికారని , ఆ తెచ్చిన డబ్బుతో ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పాడని ఒక్క పైసా కూడా రాలేదన్నారు.
మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని ఒక్కటి కూడా నిజం చెప్పలేదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోందని కానీ ఇప్పటి దాకా సోయి లేకుండా నిద్ర పోతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జై రాం రమేష్. కాంగ్రెస్ పార్టీ లేవదీసిన 9 ప్రశ్నలకు దమ్ముంటే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : S Jai Shankar