Jammu Court Frames : కాశ్మీరీ జ‌ర్న‌లిస్ట్ పై కోర్టు అభియోగం

విద్రోహ క‌థ‌నం రాశారంటూ ఆరోప‌ణ‌

Jammu Court Frames : ఓ న్యూస్ పోర్ట‌ల్ లో దేశానికి వ్య‌తిరేకంగా విద్రోహ క‌థ‌నం ప్ర‌చురించినందుకు గాను కాశ్మీర్ కు చెందిన జ‌ర్న‌లిస్టుపై కోర్టు అభియోగం మోపింది(Jammu Court Frames) . ఈ కేసు గ‌త ఏడాది ఏప్రిల్ 4న పోలీసుల‌కు అందిన స‌మాచారంతో పాటు ది ష‌కీల్స్ ఆఫ్ స్లేవ‌రీ విల్ బ్రేక్ అనే పేరుతో క‌థ‌నం రాశారు.

దీనిని జ‌ర్నలిస్టు ఫ‌హ‌ద్ షా , యూనివ‌ర్శిటీ స్కాల‌ర్ అలా ఫాజలీల‌పై కేసు న‌మోదైంది. న్యూస్ పోర్ట‌ల్ లో విద్రోహ క‌థ‌నం రాసినందుకు, ప్ర‌చురించినందుకు జ‌ర్న‌లిస్ట్ తో పాటు యూనివ‌ర్శిటీలో స్కాల‌ర్ పై కోర్టు మొద‌టిసారిగా అభియోగాలు మోపింది.

అరెస్ట్ అయిన జ‌ర్న‌లిస్ట్ పీర్జాద్ ఫ‌హ‌ద్ షా , కాశ్మీర్ యూనివ‌ర్శిటీ స్కాల‌ర్ అబ్దుల్ అలా ఫాజిలీపై కేసును రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ విచారించింద‌ని, ఇది విజ‌య‌వంతంగా అభియోగాలు మోపే ద‌శ‌కు చేరుకుంటుంద‌ని స‌మాచారం. 

ఎన్ఐఏ చ‌ట్టం కింద నియ‌మించ‌బ‌డిన ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి అశ్వ‌నీ కుమార్ షా, ఫాజిలీల‌పై అభియోగాలు మోపారు. ఈ కేసు గ‌త ఏడాది ఏప్రీల్ సిఐజే పోలీస్ స్టేష‌న్ కి అందిన స‌మాచారంతో పాటు ది షాకిల్స్ ఆఫ్ స్లేవ‌రీ విల్ బ్రేక్ అనే శీర్షిక‌తో ఫ‌జిలీ రాశారు. డిజిట‌ల్ మ్యాగ‌జైన్ క‌థ‌నం కాపీకి సంబంధించి. ఇది ది కాశ్మీర్ వాలా దాని ఎడిట‌ర్ ఇన్ చీఫ్ క‌మ్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు.

పాకిస్తాన్ మ‌ద్ద‌తుతో ఇద్ద‌రూ ఉగ్ర‌వాద‌, వేర్పాటువాద ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌కు మ‌ద్ద‌తుగా క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. డిజిట‌ల్ ప్లాట్ ఫార‌మ్ ల‌ను ఉప‌యోగించుకున్నారు. చ‌ట్టాన్ని అతిక్ర‌మించారు. నిషేధిత తీవ్ర‌వాద సంస్థ‌ల నుడి అక్ర‌మ నిధులు పొందారంటూ స్ప‌ష్టం చేసింది కోర్టు.

Also Read : బీహార్ యూట్యూబ‌ర్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!