Janhvi Kapoor : రణ్ వీర్ సింగ్ కి జాన్వీ కపూర్ సపోర్ట్
న్యూడ్ ఫోటో షూట్ అనేది కళాత్మక స్వేచ్ఛ
Janhvi Kapoor : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ వ్యవహారం. సదరు నటుడు పూర్తి నగ్నంగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు ఫోజులు ఇచ్చాడు.
వాటిని తన స్వంత ఖాతాలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపై షేర్ కూడా చేశారు. నగ్నత్వం అనేది చూసే దానిని బట్టి ఉంటుంది తప్ప ఇందులో ఎలాంటి బూతు లేదన్నది నటుల వాదన.
రణ్ వీర్ సింగ్ కంటే ముందు టాలీవుడ్ కి చెందిన రౌడీ హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండ తాను నటిస్తున్న లైగర్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా మరింత ప్రచారం లభించేలా కేవలం శరీరంలో 90 శాతం భాగాన్ని న్యూడ్ గా ఉంచాడు.
ఆ ఒక్క ముందు భాగాన్ని పూల బోకేతో అడ్డం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నటుడు రిషి ఖన్నా న్యూడ్ గా దిగాడు. ఇక ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల భర్త , ప్రముఖ తమిళ, తెలుగు నటుడిగా పేరొందిన విశాల్ కౌశిక్ పూర్తిగా నగ్నంగా ఫోజులు ఇచ్చాడు.
విచిత్రం ఏమిటంటే ఈ న్యూడ్ ఫోటోలు దగ్గరుండి తీసింది ఎవరో కాదు ఆయన భార్య గుత్తా జ్వాల. ఈ తరుణంలో దీపికా పదుకొనే భర్త అయిన నటుడు రణ్ వీర్ సింగ్ తాజాగా దిగిన న్యూడ్ ఫోటో షూట్ చర్చకు దారి తీసింది.
దీనిపై పలువురు నటీనటులు స్పందించారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మాట్లాడుతూ ఇది కళాత్మక స్వేచ్ఛగా భావిస్తున్నట్లు తెలిపారు.
వారి కళాత్మక స్వేచ్ఛ కోసం ఎవరైనా జరిమానా విధించ బడాలని తాను అనుకోవడం లేదన్నారు. ఒక రకంగా రణ్ వీర్ సింగ్ కు మద్దతు ఇచ్చారు.
Also Read : తప్పైంది మిత్రమా మన్నించవా ప్లీజ్
Delhi | I think it’s artistic freedom and I don’t think anyone should be penalised for their artistic freedom: Actor Janhvi Kapoor when asked about Ranveer Singh's nude photoshoot controversy pic.twitter.com/2AN6pYUOvY
— ANI (@ANI) July 29, 2022