KTR Daifuku : హైదరాబాద్ లో జపాన్ కంపెనీ పెట్టుబడి
రూ. 450 కోట్లతో చందనవెల్లిలో కంపెనీ
KTR Daifuku : పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు భాగ్యనగరం వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఏర్పడిన సర్కార్ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, బడా బాబులకు మేలు చేకూర్చేలా సకల సౌకర్యాలు కల్పిస్తోంది.
ప్రధానంగా ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా, తదితర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇప్పటికే కొలువు తీరాయి. తాజాగా జపనీస్ కు చెందిన ప్రముఖ ఉత్పత్తుల కంపెనీ డైఫుకు భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ తో ఎంఓయూ చేసుకుంది. హైదరాబాద్ లోని చందన వెల్లిలో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది.
ఇందుకు సంబంధించి రూ. 450 కోట్లతో యూనిట్ ప్రారంభించనుంది. దాదాపు 800 మందికి పైగా ఇందులో ఉపాధి లభిస్తుంది. ఆటోమేటెడ్ స్టోరేజ్ సిస్టమ్స్ , కన్వేయర్లు సమా ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరికరాలను సదరు సంస్థ తయారు చేస్తుంది. రెండు విడతలుగా దీనిని తయారు చేస్తుంది కంపెనీ.
మొదట దశ కింద రూ. 200 కోట్లతో ప్లాన్ తయారు చేసింది. ఇది త్వరలోనే ప్రారంభమై 18 నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటోంది. ఇదిలా ఉండగా జపాన్ కు చెందిన కంపెనీ డైఫూకూ(KTR Daifuku) హైదరాబాద్ కు రావడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు తమ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు అభినందించారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనే వాళ్లు. కానీ సీన్ మారింది. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద ను ఎంచుకుంటున్నాయి.
Also Read : ప్రపంచ కుబేరుల్లో బెర్నార్డ్..మస్క్ టాప్