Shinzo Abe Shot Dead : జ‌పాన్ మాజీ ప్ర‌ధానిపై కాల్పులు

ఇంకా ప్ర‌క‌టించ‌ని ప్ర‌భుత్వం

Shinzo Abe Shot Dead : జ‌పాన్ లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజో అబెవాస్(Shinzo Abe Shot Dead) దుండ‌గుడి చేతిలో కాల్చ‌బ‌డ్డాడు. ఆయ‌న‌కు 67 ఏళ్లు. వెనుక నుంచి వ‌చ్చి కాల్చిన‌ట్లు స‌మాచారం. స్థానిక మీడియా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

షింజో అబెవాస్ శుక్ర‌వారం నారా ప్రాంతంలో జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయ‌న చ‌ని పోయిన‌ట్లు స‌మాచారం. కానీ అధికారికంగా ఇంకా వెల్ల‌డించ లేదు ఆ దేశ ప్ర‌భుత్వం.

నేష‌న‌ల్ బ్రాడ్ క‌స్ట‌ర్ ఎన్ హెచ్ కే 40 ఏళ్ల వ్య‌క్తిని హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డినందుకు అరెస్ట్ చేశామ‌ని, తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

ఆదివారం ఎగువ స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో షింజో అబే స్టంప్ ప్ర‌సంగిస్తుండ‌గా తుపాకీ కాల్పుల శ‌బ్దం వినిపించింద‌ని క్వోడో వార్తా సంస్థ తెలిపింది.

అప్ప‌టికే రెండు సార్లు కాల్చార‌ని , అంత‌లోనే అక్క‌డున్న వారంతా ఆయ‌న చుట్టూ చేరార‌ని కానీ అప్ప‌టికే కుప్ప‌కూలి పోయాడ‌ని పేర్కొంది. మెడ నుండి ర‌క్తం కారుతూనే ఉంద‌ని వెల్ల‌డించంది.

అబేను(Shinzo Abe Shot Dead) ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ‌హుశా షాట్ గ‌న్ తో కాల్చిన‌ట్లు మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఘ‌ట‌న నేప‌థ్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి త్వ‌ర‌లో మాట్లాడార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా జ‌పాన్ లో ఎక్కువ కాలం ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేసిన చ‌రిత్ర ఆయ‌న‌కు ఉంది. కాగా భార‌త దేశంతో షింజో అబె వాస్ స‌త్సంబంధాలు కొన‌సాగించారు. ఆయ‌న చేసిన కృషికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌క‌టించి స‌త్క‌రించింది.

Also Read : పీఎం ప‌ద‌వి వ‌దులు కోవ‌డం బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!