Jasprit Bumrah : తిప్పేసిన జ‌స్ ప్రీత్ బుమ్రా

3 వికెట్లు తీసిన స్టార్ బౌల‌ర్

Jasprit Bumrah : గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకోవాల‌ని క‌ల‌లు క‌న్న ఢిల్లీ సేన‌కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ముంబై ఇండియ‌న్స్. త‌న ఆఖ‌రి 14వ మ్యాచ్ ను అద్భుతంగా ముగించి పోయిన ప‌రువును కాపాడుకుంది.

మొత్తంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ బాధ్య‌తా రాహిత్యం, జ‌ట్టు ఆట‌గాళ్ల పేల‌వ‌మైన ఫీల్డింగ్ వెర‌సి ముంబై ఇండియ‌న్స్ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి.

అటు బ్యాటింగ్ లో ఇషాన్ కిష‌న్ , టిమ్ డేవిడ్, తిల‌క్ వ‌ర్మ మెరిస్తే బౌలింగ్ లో భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. కీల‌క‌మైన మూడు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను శాసించాడు.

ఏ కోశాన పోరాడిన దాఖ‌లాలు క‌నిపించ లేదు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్ష్యం చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్ చివ‌రి ఓవ‌ర్ దాకా పోరాడింది.

మొత్తంగా గౌర‌వ ప్ర‌దంగా ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ నుంచి త‌ప్పుకుంది. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు ముగిశాయి. 5 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది ముంబై ఇండియ‌న్స్.

కానీ దుబాయ్ లో జ‌రిగిన 14వ సీజ‌న్ లోనూ ప్ర‌స్తుతం ముంబైలో కొన‌సాగుతున్న 15వ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌డం ఆ జ‌ట్టునే కాదు మేనేజ్ మెంట్ ను క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

దీనిని చేజిక్కించుకుంది రిల‌య‌న్స్ గ్రూప్. ఏది ఏమైనా బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్ దెబ్బ‌కు ఢిల్లీ క‌ల‌వ‌రానికి గురైంది.

Also Read : ప‌ర్పుల్ క్యాప్ రేసులో చ‌హ‌ల్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!