Javaria Khanam : పాక్ యువ‌తికి భార‌త్ వీసా

45 రోజుల పాటు జారీ

Javaria Khanam : జ‌మ్మూ కాశ్మీర్ – పాకిస్తాన్ కు చెందిన మ‌హిళ‌కు కేంద్ర ప్ర‌భుత్వం వీసా మంజూరు చేసింది. పాక్ కు చెందిన అజ్మ‌త్ ఇస్మాయిల్ ఖాన్ కూతురు క‌రాచీకి చెందిన జ‌వారియా ఖాన‌మ్ కు వీసా ఇవ్వాల‌ని విన్న‌వించింది.

Javaria Khanam got Indian Visa

మంగ‌ళ‌వారం జ‌వారియా ఖాన‌మ్ వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త్ లోకి ప్ర‌వేశించారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇరు దేశాల‌కు చెందిన సైనికులు ఖాన‌మ్ ను స్వాగ‌తించారు. ప్ర‌స్తుతం ఇరు దేశాల మ‌ధ్య తీవ్ర‌మైన ఉద్రిక్త‌లు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల భార‌త్ లో జ‌రిగిన ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ రాద‌ని అనుకున్న పాకిస్తాన్ జ‌ట్టు అనుకోని రీతిలో వ‌చ్చింది. టోర్నీ కూడా ముగిసింది. ఇదిలా ఉండ‌గా జ‌వారియా ఖాన‌మ్ కోసం భ‌ర్త‌, బావ వేచి ఉన్నారు. త‌ను కాబోయే భ‌ర్త స‌మీర్ ఖాన్ , బావ అహ్మ‌ద్ క‌మ‌ల్ ఖాన్ యూసుఫ్ జాయ్ ఆమెకు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా అంతులేని సంతోషానికి లోనైంది జ‌వారియా ఖాన‌మ్ . త‌ను పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వ‌చ్చింది. తాను పెళ్లి చేసుకోబోయే వ‌రుడు కోల్ క‌తాలో క‌ల‌కాలం ఉండాల‌ని కోరుకుంటోంది. దీంతో వీసా జారీ చేసిన భార‌త ప్ర‌భుత్వానికి జ‌వారియా ఖాన‌మ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌ని పేర్కొంది.

Also Read : Dk Shiva Kumar : ముగిసిన స‌మావేశం సీఎంపై నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!