Jay Shah Comment : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం లో ట్రబుల్ షూటర్ గా కొనసాగుతూ వస్తున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయన తనయుడే జే షా(Jay Shah). ఆ మధ్యన కుటుంబ పార్టీలంటూ పదే పదే ఆరోపణలు చేసిన నాయకులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
ఆయన ఏకంగా అమిత్ షాను ఉద్దేశించి జే షా ఎన్ని సెంచరీలు చేశాడంటూ ప్రశ్నించారు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థలలో టాప్ త్రీలో ఒకటిగా పేరొందింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది బీసీసీఐ కార్యవర్గంపై. అక్టోబర్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తంగా పైకి కనిపించేది ఎవరైనా మొత్తంగా బీసీసీఐ పూర్తిగా అమిత్ షా తనయుడి కనుసన్నలలోనే కొనసాగనుంది. ఇప్పటికే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.
ఇక బెంగాలీయులు ప్రేమగా పిలుచుకునే దాదా అలియాస్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ మాజీ బాస్ గా ఉండనున్నారు.
ఇది పక్కన పెడితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్ గా ఉన్న 1983 వరల్డ్ కప్ ను గెలుపొందిన జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ బీసీసీఐకి కాబోయే బాస్ అన్నది ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది నెలాఖరులో ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. మరి గంగూలీ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇంతలో ఇప్పటికే కాషాయ శ్రేణులకు చెందిన వారే బీసీసీఐని ఏలబోతున్నారనేది వాస్తవం. రాజీవ్ శుక్లాను పక్కన పెడితే జే షా కార్యదర్శిగా
కొనసాగుతారు. ఇప్పటికే కన్ ఫర్మ్ కూడా అయి పోయింది.
ఇదిలా ఉండగా బీసీసీఐ(BCCI) కొత్త పవర్ ప్యానెల్ ఇప్పటికే నిర్ణయం జరిగిందని, గత నెల రోజులుగా పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జే షా. అన్ని ప్రధాన ఈవెంట్లను అహ్మదాబాద్ లో నిర్వహించేలా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ కు ప్రధాన కార్యాలయంగా మారింది.
ఆకర్షణీయమైన, దూకుడు స్వభావం కలిగిన గంగూలీ స్థానంలో అత్యంత నిరాడంబరమైన శైలిని కలిగి ఉన్న బిన్నీ రాబోతున్నాడు.
దీంతో బీసీసీఐ పవర్ అంతా జే షా(Jay Shah) చుట్టే కేంద్రీకృతం కావడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇక అధ్యక్ష పదవికి బిన్నీ,
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా జే షా, కోశాధికారిగా ఆశిష్ షెలార్ , జాయిట్ సెక్రటరీగా దేవాజిత్ సైకియా నామినేషన్ దాఖలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే అయిన షెలార్ , ఆ పార్టీకి ముఖ్యుడిగా ఉన్నారు.
ఇక కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ సోదరుడే అరుణ్ ధుమాల్. ప్రస్తుతం ఐపీఎల్ చైర్మన్ గా ఉండనున్నారు. ఇక సైకియా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు అత్యంత సన్నిహితురాలుగా పేరొందారు.
ఇదే సమయంలో ఐపీఎల్ చైర్మన్ పదవిని గంగూలీకి ఆఫర్ చేసినట్లు సమాచారం.
తనకు వద్దని చెప్పినట్లు టాక్. ఏది ఏమైనా ఇప్పుడు బీసీసీఐ బాస్ మాత్రం జే షానే. కాదనలేం ఎందుకంటే పవర్ ప్రభావానికి ఎవరైనా తల వంచాల్సిందే.
Also Read : ఐపీఎల్ చైర్మన్ రేసులో అరుణ్ ధుమాల్