Jayaho Bharat : మేరా భార‌త్ మ‌హాన్

నిండి పోయిన మోదీ స్టేడియం

Jayaho Bharat  : అహ్మ‌దాబాద్ – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మ్యాచ్ లు పూర్త‌య్యాయి. నిన్న‌టి దాకా చ‌ప్ప‌గా సాగాయి అన్ని మ్యాచ్ లు. బీసీసీఐ నిర్వాకంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఆయా మ్యాచ్ ల‌కు ప్రేక్ష‌కులు పెద్ద‌గా హాజ‌రు కాక పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

Jayaho Bharat Trending

చివ‌ర‌కు ఎప్ప‌టి లాగే దాయాదులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కు వేదికైంది బీసీసీఐ(BCCI) కార్య‌ద‌ర్శి జే షా, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా అడ్డా అయిన గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియం. ప్ర‌పంచ క్రికెట్ రంగానికి సంబంధించి భారీ ఎత్తున ప్రేక్ష‌కుల‌కు వేదిక‌గా దీనిని తీర్చి దిద్దారు. సక‌ల సౌక‌ర్యాలు క‌ల్పించారు.

ఇదిలా ఉండ‌గా గ‌త మ్యాచ్ ల‌కు ఆశించిన మేర రాలేదు. స్పంద‌న కూడా లేక పోవ‌డం ఒకింత క్రికెట్ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురి చేసింది. ఇదే స‌మ‌యంలో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌లో పూర్తిగా బీసీసీఐ విఫ‌ల‌మైంద‌ని మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆరోపించాడు.

తాజాగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క పోరులో భార‌త్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ కు ఊహించ‌ని రీతిలో అభిమానులు హాజ‌ర‌య్యారు. భార‌తీయ జెండాలతో స్టేడియం క్రిక్కిరిసి పోయింది. టోర్నీకి మంచి ఊపు తీసుకు వ‌చ్చేలా చేసింది.

Also Read : Telangana Congress List : 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

Leave A Reply

Your Email Id will not be published!