Jayasudha Join : త్వరలో బీజేపీలో చేరనున్న జయసుధ
బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని కలిసిన నటి
Jayasudha Join : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రముఖ విలక్షణ నటి జయసుధ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఆమె రాష్ట్ర బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
Jayasudha Join In BJP
జయసుధ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సినీ రంగంలో ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. డిసెంబర్ 17, 1959లో తమిళనాడు రాజధాని మద్రాసులో పుట్టారు. ఆమె అసలు పేరు సుజాత. భర్త నితిన్ కపూర్. ఇద్దర పిల్లలు ఉన్నారు. దివంగత నటి, నిర్మాత విజయనిర్మల జయసుధ(Jayasudha)కు మేనత్త. ఆమె ఇప్పటి వరకు 300 సినిమాలలో నటించారు. 20 తమిళ, 8 మలయాళ, 3 హిందీ, ఒక కన్నడ సినిమాలు ఉన్నాయి.
ఆమె పేరు మీద అరుదైన రికార్డు కూడా ఉంది. ఒకే ఏడాదిలో ఏకంగా జయసుధకు చెందిన 25 సినిమాలు విడుదలయ్యాయి. 2001లో బాప్టిజం పుచ్చుకున్నారు. అనాధల కోసం ట్రస్టు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Also Read : AP CM Governor Congrats : ఇస్రో టీంకు జగన్..నజీర్ కంగ్రాట్స్