Nikhil Mandal : జేడీయూకు షాక్ స్పోక్స్ పర్సన్ రిజైన్
ట్విట్టర్ వేదికగా నిఖిల్ మండల్ డిక్లేర్
Nikhil Mandal : జేడీయూ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి నిఖల్ మండల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఇవాళ వెల్లడించారు.
పార్టీకి సంబంధించి అత్యంత పిన్న వయస్కుడిగా పేరొందారు మండల్. ఆయన వయస్సు కేవలం 41 ఏళ్లు మాత్రమే. ఇదిలా ఉండగా నిఖిల్ మండల్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మధేపురా నుంచి పోటీ చేసి ఆర్జేడీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక పార్టీ అధికార ప్రతినిధిగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేశారు. ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు.
బీహార్ లో అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి గాయాలను నెమరు వేసుకుంటున్న మాజీ మిత్రపక్షమైన బీజేపీ తమ వాస్తవ నాయకుడైన సీఎం నితీశ్ కుమార్ ను(Nitish Kumar) సమర్థించడంలో జేడియూ ప్రతినిధిధులు కొంచెం ఇబ్బందిగా ఉన్నారని మండల్ రాజీనామా చెబుతోంది.
కాగా తన అధికారిక లెటర్ హెడ్ పై పార్టీ నాయకత్వానికి పంపిన సమాచారానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను మండల్ షేర్ చేశారు. అయితే ఎవరినీ ఉద్దేశించి పేర్కొనక పోవడం విశేషం.
తాను జేడీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 31 జనవరి 2016 నుండి ఈ పదవిని నాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటాన్ననని పేర్కొన్నారు మండల్(Nikhil Mandal).
దయచేసి నా రాజీనామా విన్నపాన్ని ఆమోదించ గలరని కోరుతున్నానని తెలిపారు. ప్రస్తుతం మండల్ రాజీనామా కలకలం రేపుతోంది.
Also Read : ఉత్తరాఖండ్ సీఎంపై ఓవైసీ సీరియస్