PM Modi : మోదీతో జెన్సన్ హువాంగ్ భేటీ
భారత అభివృద్ది గురించి ప్రశంస
PM Modi : ఎన్వీడియా సిఇఓ జెన్సన్ హువాంగ్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కీలక అంశాల గురించి చర్చించారు. అన్ని రంగాలలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు.
PM Modi Meet Jensen Huang
ఇవాళ ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలకమైన పాత్ పోషిస్తోందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి భారత దేశం అందించే గొప్పనైన సంభావ్యత గురించి చర్చించడం జరిగిందని వెల్లడించారు జెన్సన్ హువాంగ్.
ఈ రంగంలో భారత్ పురోగతి అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. దేశంలో ప్రతిభాంతమైన యువత ఎక్కువ ఉందని కితాబు ఇచ్చారు. ఈ మేరకు తనతో సమావేశమైన జెన్సన్ హువాంగ్ తో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).
శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధనా రంగాలలో భారత దేశం తనదైన ముద్ర కనబరుస్తోందని స్పష్టం చేశారు పీఎం. రాబోయే రోజుల్లో సూపర్ పవర్ ఎకానమీ గా తమ దేశం ఎదుగుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు పీఎం.
Also Read : Nara Lokesh : సామాన్య భక్తుల కష్టాలు తీర్చండి