Sanjeev Kapoor CEO : జెట్ ఎయిర్‌వేస్ సిఇఓ కీల‌క కామెంట్స్

పునః ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నాం

Sanjeev Kapoor CEO : జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ సంజీవ్ క‌పూర్(Sanjeev Kapoor CEO) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న జాతీయ మీడియాతో సోమ‌వారం మాట్లాడారు. ఎయిర్ లైన్ పునః ప్రారంభంపై ఆలోచిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా సంజీవ్ కపూర్ ఏవియేష‌న్ ప్రొఫెష‌న‌ల్ గా ఉన్నారు.

భార‌తీయ విమాన‌యాన రంగం ప్ర‌స్తుతం ఆశాజ‌నంగా ఉంద‌న్నారు. 2000 నుండి దేశంలో ఎయిర్ ట్రాఫిక‌క్ వృద్ది అసాధార‌ణంగా ఉంద‌న్నారు. కోవిడ్ కార‌ణంగా కొంత ఇబ్బంది ఏర్ప‌డింద‌న్నారు. దేశంలో ప్ర‌యాణీకుల సంఖ్య 2000లో 13.7 మిలియ‌న్లు ఉంటే 2013లో ఇది 61.4 మిలియ‌న్లుగా ఉంద‌న్నారు.

ఇక 2019లో 143 మిలియ‌న్ల ప్ర‌యాణీకుల‌కు చేరుకుంద‌న్నారు. రెండు ద‌శాబ్దాల కాలంలో సంఖ్య ప‌ది రెట్లు పెరగ‌డం తాను గ‌మ‌నించాన‌ని చెప్పారు సిఇఓ. ఇదిలా ఉండ‌గా 2019లో కోల్ క‌తా ఎయిర్ పోర్ట్ నుంచి ఏకంగా 20 మిలియ‌న్ల మంది ప్ర‌యాణీకుల‌ను నిర్వ‌హించింద‌న్నారు.

దేశంలో మొత్తం ఎయిర్ లైన్స్ ల‌కు సంబంధించి 113 విమానాలు క‌లిగి ఉంటే 2013లో 395కి చేరుకున్నాయ‌ని తెలిపారు. కాగా 2019లో విమానాల సంఖ్య 706కి పెరిగాయ‌ని వెల్ల‌డించారు సంజీవ్ కపూర్. ఇక చైనాలో ఒక్కో ఎయిర్ లైన్ సంస్థ ఏకంగా 700 విమానాలు క‌లిగి ఉన్నాయ‌ని మ‌న దేశానికి చైనాకు ఇదే తేడా అని పేర్కొన్నారు.

ఇక 2005 నుండి 2015 వ‌ర‌కు ముంబై, ఢిల్లీ, కోల్ క‌తా , చెన్నై వంటి ప్ర‌ధాన మెట్రోల లోని ఎయిర్ పోర్టులు ఉండేవి. బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ల‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు భారీగా విస్త‌రించాయ‌ని తెలిపారు సిఇఓ.

Also Read : హైద‌రాబాద్ లో వెబ్ 3.0 పై స‌ద‌స్సు

Leave A Reply

Your Email Id will not be published!