Jigna Vora Comment : ధీర వనిత జిగ్నా వోరా
కాలాన్ని జయించిన కలం కవాతు
Jigna Vora Comment : ఈ దేశంలో ప్రమాదకరమైన రంగం ఏదైనా ఉందంటే అది మీడియా రంగమే. అభియోగాలు ఎదుర్కొని, అవమానాలు భరించి, ఇప్పటికీ భయం భయంగా బతుకుతూనే ఉన్నా ఎక్కడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా తన కలంతో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు జిగ్నా వోరా. ఆమె రాసిన పుస్తకం బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా – మై డేస్ ఇన్ ప్రిజన్ సంచలనం సృష్టించింది. తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పుస్తకంగా రాసింది. ప్రతి అక్షరం వాస్తవమైనదే. జీవితం ఎంత కర్కశంగా ఉంటుందో, కాలం ఎంతగా దయనీయంగా మార్చేలా చేస్తోంది కళ్లకు కట్టినట్లు చెప్పింది. జిగ్నా వోరా(Jigna Vora) జర్నలిస్టుగా పేరు పొందారు. అదే సమయంలో అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. జైలుకు వెళ్లారు. అక్కడ తను అనుభవించిన ప్రతి దానిని అక్షరాలలోకి వలికించారు. అవి కన్నీళ్లు పెట్టించాయి. ఆ తర్వాత తన జీవిత కథనే ఆధారంగా చేసుకుని నెట్ ఫ్లిక్స్ లో స్కూప్ పేరుతో వెబ్ సీరీస్ ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా ఆ సీరీస్ ప్రసారమైన కొన్ని క్షణాల్లోనే యావత్ ప్రపంచమంతా ఆదరించింది. భారీ ఆదరణను చూరగొంది.
నిజం చేదుగా ఉన్నా వాస్తవం కఠినంగా మారినా నిప్పులు లాంటి అనుభవ ప్రయాణం ఎప్పటికీ చెరిగి పోదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్కూప్ గురించిన చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ జిగ్నా వోరా(Jigna Vora) ఎవరు. ఆమె ప్రస్థానం ఏంటి. ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలాంటివి. తెలుసు కోవాలంటే తను రాసిన పుస్తకం చదవాలి. లేదా కళ్లకు కట్టినట్లు వాస్తవాలను బుల్లి తెర మీద ఆవిష్కరించిన స్కూప్ వెబ్ సీరీస్ చూడాలి. మాఫియా ప్రపంచం ఎలా డామినేట్ చేస్తుందో. మీడియాలో పని చేస్తూ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారో, చివరకు ప్రాణాలు సైతం ఎలా పణంగా పెట్టాల్సి వస్తుందో చూసి తీరాల్సిందే. ఇక జిగ్నా వోరా గురించి తెలుసు కోవాలంటే ముందు ప్రఖ్యాత జర్నలిస్ట్ జేడేని గుర్తుకు తెచ్చుకోవాలి. 2011లో మాఫియా డాన్ ఛోటా రాజన్ ముఠా హత్య చేశారు. ఈ మర్డర్ కు సంబంధించి అభియోగాలు ఎదుర్కొన్నారు జిగ్నా వోరా. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్ల పాటు జైలులో గడిపింది. ఆ సమయంలోనే ఆరోపణలు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారు. కోర్టులో విచారణలు పూర్తయ్యాయి. నిర్దోషిగా విడుదలయ్యారు.
కానీ విలువైన కాలాన్ని కోల్పోయారు. జైళ్లు, ఖైదీలు, అక్కడ పోలీసులు, బారక్ ల వెనుక ఉన్న కథలు..కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు రాసింది జిగ్నా వోరా. ఆమెపై ప్రధాన ఆరోపణ జేడే గురించి రాజన్ కు వివరాలు అందించారని. బైకుల్లా జైలు నుండి 2012లో విడుదలయ్యారు. ఇప్పుడు మరోసారి జిగ్నా వోరా హాట్ టాపిక్ గా మారారు. స్కూప్ సీరీస్ లో వోరా పాత్రలో కరిష్మా తన్నా నటించారు. ఒక రకంగా అందులో జీవించారు. జాగృతి పాఠక్ రిపోర్టర్ గా నటించింది. ఏది ఏమైనా ఒక మహిళ తన జీవిత కాలంలో ఒడిదుడుకులను దాటుకుని నిలవడం మామూలు విషయం కాదు. జిగ్నా వోరా(Jigna Vora) నిన్నటి తరానికి రేపటి కాలానికి ఒక ఉదాహరణ మాత్రమే కాదు వేగు చుక్క అనడంలో సందేహం లేదు. హ్యాట్సాఫ్ వోరా..
Also Read : Senthil Balaji : సెంథిల్ బాలాజీకి కోర్టులో చుక్కెదురు