Jignesh Mevani : బలమైన గొంతుకు ప్రతిరూపం ‘జిగ్నేష్’
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగింపు
Jignesh Mevani : గుజరాత్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత 27 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఏకంగా 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం విపక్షాలకు ఇది ఒక ప్రచార అస్త్రంగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలవనుంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన గొంతుకగా ఉన్నారు జిగ్నేష్ మేవాని. ఆయన తన వాయిస్ ను బీజేపీకి వ్యతిరేకంగా వినిపిస్తూ వస్తున్నారు. అతడిపై అకారణంగా కేసు నమోదు చేశారు.
ఆపై అరెస్ట్ కూడా చేశారు. కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ జిగ్నేష్ మేవానీకి(Jignesh Mevani) బెయిల్ మంజూరు చేసింది. దళిత నాయకుడిగా ఎదిగారు జిగ్నేష్ మేవాని. 2017లో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లో వడ్గామ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2016లో ఆవు స్మగ్లింగ్ ఆరోపణలపై ఏడుగురు దళిత యువకులను చిత్రహింసలకు గురి చేయడంపై పోరాటం చేశారు.
ఈ ఘటనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలకు నాయకత్వం వహించారు జిగ్నేష్ మేవాని. ఆ తర్వాత బలమైన స్వరంగా , నాయకుడిగా మారారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదిలా ఉండగా వడ్గామ్ లో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు.
బీజేపీకి చెందిన విజయ్ కుమార్ పై 20 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు జిగ్నేష్ మేవానీ. కాంగ్రెస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యే మణిభాయ్ వాఘేలాను మేవానీకి మద్దతుగా ఆ స్థానం నుండి ఇదార్ నియోజకవర్గానికి తరలించింది. ఈ ఏడాది జూలైలో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏడుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది.
అందులో ఒకరిగా జిగ్నేష్ మేవానీని ఎంపిక చేసింది పార్టీ. సెప్టెంబర్ లో జిగ్నేష్ కు 2016 కేసులో అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గుజరాత్ యూనివర్శిటీలోని లా భవన్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు జిగ్నేష్ మేవానీ.
అనంతరం అప్పిలేట్ కోర్టు తర్వాత జిగ్నేష్ మేవానీతో పాటు 18 మందికి బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్ లో 1980 డిసెంబర్ 11న పుట్టిన జిగ్నేష్ మేవానీ చదువుతూనే పోరాడారు. దళితుల హక్కుల కోసం నినదించారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్ గా ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించేందుకు రెడీ అయ్యారు జిగ్నేష్ మేవానీ.
Also Read : అభిషేక్ రావు..నాయర్ కస్టడీ పొడిగింపు