Jio True 5G : నాలుగు నగరాల్లో జియో 5జీ సేవలు
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం
Jio True 5G : దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో దసరా పండుగ అక్టోబర్ 5 నుంచి రిలయన్స్ జియో 5జీ సేవలను(Jio True 5G ) ప్రారంభించింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీలలో ముందస్తుగా జియో శ్రీకారం చుట్టింది.
దీని వల్ల అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. ఇదిలా ఉండగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, కోల్ కతా, వారణాసిలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.
కాగా ఎంపిక చేసిన వినియోగదారులతో 5జీ సేవలకు సంబంధించిన బీటా ట్రయల్ ను టెస్టింగ్ చేస్తామని తెలిపింది రిలయన్స్ జియో కంపెనీ. జియో వెల్ కమ్ ఆఫర్ కింద కస్టమర్లకు ఇన్విటేషన్ పంపిస్తుందని పేర్కొంది.
సబ్ స్క్రైబర్లు సెకనుకు 1 గిగా బిట్ వేగంతో అపరిమిత 5జీ డేటాను పొందుతారని వెల్లడించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో రిలయన్స్ జియో స్పష్టమైన ప్రకటన చేసింది.
425 మిలియన్లకు పైగా వినియోగదారులతో 5జీతో జియో తన సేవలను విస్తృతం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజిటల్ భారతాన్ని సృష్టించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
5జీ కనెక్టివిటీ అనేది సాంకేతిక జీవితాలను మెరుగు పర్చడం, జీవనోపాధిని అందించడం ద్వారా మానవాళికి సేవ చేయడంలో ఉపయోగ పడుతుంది.
విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది, చిన్న, మధ్య తరహా , పెద్ద సంస్థలు, స్మార్ట్ హోమ్ లు , గేమింగ్ లో 1.4 బిలియన్ల భారతీయులను ప్రభావితం చేసే పరివర్తన మార్పులను తీసుకు వస్తుందని పేర్కొంది రిలయన్స్ జియో సంస్థ.
Also Read : 5జీ సేవలు వైజాగ్ లో ఏర్పాటు చేయాలి