Joe Biden Host Modi : మోదీకి విందు ఇవ్వ‌నున్న బైడెన్

ఈ వేస‌విలోనే ప్రెసిడెంట్ ఆహ్వానం

Joe Biden Host Modi : అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ ఈ వేస‌విలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి విందు ఇవ్వ‌నున్నారు. ఇదే విష‌యాన్ని ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఇదిలా ఉండ‌గా బైడెన్ మేలో ఆస్ట్రేలియా, జ‌పాన్ నాయ‌కుల‌తో పాటు క్వాడ్ స‌మ్మిట్ కోసం స‌మావేశ‌మైన‌ప్పుడు ప్ర‌ధాని మోడీతో(Joe Biden Host Modi)  క‌ల‌వ‌నున్నారు. ఈ వేస‌విలోనే పీఎంకు రాష్ట్ర విందు కోసం ఆతిథ్యం ఇవ్వ వ‌చ్చ‌ని స‌మాచారం. అమెరికా రాజ‌కీయ నేత‌లు ప్ర‌ధానమంత్రితో సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అధికారిక రాష్ట్ర ప‌ర్య‌ట‌న అనేది చైనా నుండి పెరుగుతున్న ముప్పుగా భావించే వాటిని ఎదుర్కొనేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఇండో ప‌సిఫిక్ కోసం ప‌రిపాల‌నా విధానాలు, కార్య‌క్ర‌మాల‌ను అభివృద్ధి చేస్తోంది భార‌త్. యుఎస్ – భార‌త్ బంధాన్ని మ‌రింత‌గా పెంచేందుకు సంకేతం ఇస్తోంది అమెరికా చీఫ్ బైడెన్. వైట్ హౌస్ లో రాష్ట్ర విందు జూన్ లో జ‌ర‌పాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఆల‌స్యం క‌లుగుతోంద‌ని భావిస్తోంది అమెరికా. దీనిపై జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ప్ర‌తినిధి వ్యాఖ్యానించేందుకు నిరాక‌రించారు. 

సెప్టెంబ‌ర్ లో న్యూఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 లీడ‌ర్స్ స‌మ్మిట్ కు భార‌త దేశం ఆతిథ్యం ఇస్తుంద‌న్నారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశాల‌లో ఒక‌టి. అయితే ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతారా లేదా అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మొత్తంగా మీద మోదీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మార‌డం విశేషం.

డిసెంబ‌ర్ లో ఫ్రెంచ్ చీఫ్ ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తో , దక్షిణ కొరియా చీఫ్ యూన్ సుక్ యోల్ కు ఏప్రిల్ 26న షెడ్యూల్ చేసింది అమెరికా.

Also Read : పుతిన్ కు అరెస్ట్ వారెంట్

Leave A Reply

Your Email Id will not be published!