Joe Root : యాషెస్ సీరీస్ లో భాగంగా ఇంగ్లండ్ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 మ్యాచ్ లలో ఓడి పోయింది. ఒక్క నాలుగో టెస్టు డ్రా చేసుకుని పరువు పోకుండా కాపాడుకుంది.
ఇవాళ చివరిదైన ఐదో టెస్టులో సైతం చాప చుట్టేసింది. ఏకంగా 146 తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ తరుణంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ టెస్టు స్కిప్పర్ జో రూట్ (Joe Root)మీడియాతో మాట్లాడాడు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఏ కోశానా ఆసిస్ కు పోటీ ఇవ్వలేక పోయామని ఒప్పుకున్నాడు. అంతే కాదు ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నాడు. అయితే మేం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.
ఏది ఏమైనా విజయానికి ఆసిస్ ఆటగాళ్లు అర్హులని పేర్కొన్నాడు జో రూట్(Joe Root). వాళ్లు అన్ని విభాగాలలో రాణించారని కానీ తాము ఎక్కడా పోటీ ఇవ్వలేక పోవడం తనను ఒకింత నిరాశకు గురి చేసిందన్నాడు.
రాబోయే రోజుల్లో మరింత కఠినమైన మ్యాచ్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశాడు. అయితే వ్యక్తిగతంగా నా కెరీర్ లో ఇది మాయని మచ్చగా మిగిలి పోతుందన్నాడు జో రూట్.
ఇంత ఘోరంగా ఓటమి చవి చూడటం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నాడు. మేం మళ్లీ పునరాలోచించు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
మా బౌలర్లకు సరైన సమయం లభించ లేదనే తాను అనుకుంటున్నానని కానీ ఈ ఓటమికి తాను ఎవరినీ నింద దల్చుకోలేదని స్పష్టం చేశాడు జో రూట్.
Also Read : కోహ్లీ స్ఫూర్తి దాయకమైన లీడర్